ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ (లేటెస్ట్ ఫొటో)

By Srikanya

హైదరాబాద్: గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వస్తున్న ఎన్టీఆర్ ఇలా ఎయిర్ పోర్ట్ లో ఉండగా కెమెరాకు చిక్కారు. హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో తీసిన ఫొటో ఇది. ఈ ఫొటోలో తారక్ చాలా స్మార్ట్ గా ఉన్నాడు. క్లాస్,మాస్ లను అలరించేటట్లుగా పూరీ డైరక్షన్ లో రెడీ అవుతున్న చిత్రంలో కనిపించనున్నాడని సమాచారం.

టెంపర్ లో మంచి ట్విస్ట్ లు, టర్న్ లు ఉన్నాయని అంటున్నారు. ఎన్టీఆర్ ఎన్నో కమర్షియల్ చిత్రాల్లో చేసినప్పటికి ఇది స్పెషల్ గా ఉండబోతుందని అంటున్నారు. మరో ప్రక్క డిసెంబర్ 1 వ తేదీన టెంపర్ టీజర్ విడుదల చేయటానికి సిద్దం చేస్తున్నారు. ఎడిటర్ ఎస్.ఆర్ శేఖర్ ఈ మేరకు ఆ వీడియో ఎడిటింగ్ పనిలో బిజీగా ఉన్నారు.

ఇన్నాళ్లూ గోవాలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి ఇప్పటివరకూ ఏ టైటిలూ అఫీషియల్ గా ప్రకటించలేదు. ఈ నేపధ్యంలో ఇప్పటివరకూ నేనో రకం, టెంపర్ అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘టెంపర్' అనే టైటిల్ ని ఫైనల్ చేసిననట్లు సమాచారం. ఈ మేరకు డిజైన్స్ చేయించి చూసినట్లు తెలుస్తోంది.ఈ వారంలోనే ఓ టైటిల్ ని ఫైనల్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదలనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూనిట్ రాత్రింబవళ్లూ కష్టపడుతున్నట్లు వినపడుతోంది.

ఎన్టీఆర్‌ సినిమా అంటే మాస్‌ ప్రేక్షకులకు పండగే. పోరాట ఘట్టాలూ, నృత్యాలూ, పదునైన సంభాషణలతో విందు భోజనం వడ్డించేస్తారు. ఇలాంటి కథల్ని తెరపై ఆవిష్కరించడంలో దిట్ట పూరి జగన్నాథ్‌. వీరిద్దరి కలయికలో ఈ చిత్రం రూపుదిద్దుకొంటోంది. కాజల్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్‌ నిర్మాత.

NTR in Hyderabad Airport!

ఇప్పటివరకూ గోవాలో యాక్షన్‌ ఘట్టాలతో పాటు కొన్ని సరదా సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ శక్తిమంతమైన పోలీసు అధికారిగా కనిపిస్తాడని సమాచారం. జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ .

మరో ప్రక్క...కొంతకాలం దర్శకుడు,హీరో మధ్య ఇగో క్లాషెష్, కొంతకాలం భారీ వర్షాలు, మరికొంతకాలం స్ట్రైక్ ఇలా రకరకాల కారణాలు..పూరీ, ఎన్టీఆర్ సినిమాను ఆలస్యం చేస్తూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆ లేటు వెళ్లి ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్ మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పూరీ. అందులో భాగంగా లైవ్ ఎడిటింగ్ ని చేయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇందునిమిత్తం గోవా షూటింగ్ స్పాట్ కు ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్ వెళ్లారు. గతంలో ఎస్.ఆర్.శేఖర్.. పూరి చిత్రం ఇద్దరమ్మాయిలతో ట్రైలర్ కట్ చేసారు. ఆ ట్రైలర్ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ తెచ్చిన సంగతి తెలిసిందే.

షూటింగ్ అయిన దాన్ని ఎప్పటికప్పుడు ఎడిట్ చేసేస్తూంటారు. దాని మూలంగా బాగా రాని షాట్స్, మర్చిపోయిన షార్ట్ ఎప్పటికప్పుడు తెలిసిపోయి... ప్యాచ్ వర్క్ వంటివి నివారించవచ్చు. అలాగే ఎడిటింగ్ అయ్యే సమయం కలిసివస్తుంది. ప్రస్తుతం రఫ్ ఎడిటింగ్ చేసుకుని చివర్లో కాస్త టైమ్ తీసుకుని ఫైనల్ ఎడిటింగ్ చేసేస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X