HBD NTR: సిక్స్‌ప్యాక్‌తో కేక పెట్టించిన ఎన్టీఆర్.. ఇండియాలోనే నెంబర్ 1
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్ హంగామా మొదలైంది. అభిమానులు, సన్నిహితులు ఆయనకు బర్త్ డేను పురస్కరించుకొని సోషల్ మీడియాలో పోస్టులతో అదరగొడతున్నారు. ట్విట్టర్‌లో ఫ్యాన్స్ ఎన్టీఆర్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే తక్కువ సమయంలోనే ఎక్కువ ట్వీట్లు సాధించిన ఏకైక హీరోగా రికార్డును కూడా అందుకోబోతున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు ఎవరూ చూడని ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

ఎన్టీఆర్ బర్త్ డే రోజున RRR
ఎన్టీఆర్ బర్త్ డే రోజున RRR యూనిట్ భీమ్ ఫస్ట్ లుక్ టీజర్‌ను రిలీజ్ చేస్తుందని ఫ్యాన్స్ ఎదురూ చూశారు. అయితే లాక్‌డౌన్ కారణంగా టీజర్ పనులు పూర్తి కాకపోవడంతో యూనిట్ ఓ లేఖను విడుదల చేసి కారణాన్ని వివరించారు. లాక్‌డౌన్ కారణంగా మేము ఎన్టీఆర్ బర్త్ డే ఫస్ట్ లుక్‌ను అందించలేకపోతున్నాం అని చెప్పారు.

నిరాశలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానుక
ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఫస్ట్ లుక్ రావడం లేదనే నిరుత్సాహంలో ఉన్న అభిమానులకు ఆయన వ్యక్తిగత ఫిజికల్ ట్రైనర్ లాయడ్ స్టీవెన్ ఓ శుభవార్తను అందించారు. ఎన్టీఆర్ జన్మదినం రోజున అభిమానులకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక విషయాన్ని రివీల్ చేస్తానని చెప్పారు. చెప్పిన ప్రకారమే మే 19వ తేదీ సాయంత్రం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటోను షేర్ చేశారు.

యంగ్ టైగర్‌ను ఎప్పుడూ చూసి ఉండరు
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను మీరెప్పుడు ఇలా చూసి ఉండరు. సిక్స్ ప్యాక్‌తో ఎన్టీఆర్ ఇలా ఉండేవారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ఫోటోగ్రాఫర్, బాలీవుడ్‌లో పేరు ఉన్న దబ్బూ రత్నానీ ఈ ఫోటోను తీశారు. ఇది మీకు యంగ్ టైగర్ జన్మదిన కానుకగా అందిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ అంటూ లాయడ్ స్టీవెన్ ట్వీట్ చేశారు.
Recommended Video

యంగ్ టైగర్ రికార్డు
ఇక బర్త్ డే ముందు రోజున ఎన్టీఆర్ ఓ ఘనతను సొంతం చేసుకొన్నారు. 20 నిమిషాల్లోనే 1 మిలియన్ ట్వీట్స్ సొంతం చేసుకొన్న హీరోగా రికార్డు సృష్టించాడు. ఇండియాలో ఇలా వేగంగా ట్వీట్స్ సాధించిన ఏకైక హీరో అని అభిమానులు ఢంకా బజాయిస్తున్నారు. గతంలో పవన్ కల్యాణ్ పేరిట ఈ రికార్డు ఉండేది. పవర్ స్టార్ 37 నిమిషాల్లో 1 మిలియన్ బర్త్ డే ట్వీట్స్‌ను పొందినట్టు రికార్డు ఉంది.


Click it and Unblock the Notifications











