త్రిష తన డైరీలో ఒక విషయాన్ని ప్రముఖంగా రాసుకోవచ్చు. 2008 సంవత్సరానికి సంబంధించి ఆమె ఐదు తెలుగు, తమిళ సినిమాల్లో బుక్ అయింది. దక్షిణాది సినిమాల్లో ఆమె ఇప్పుడు బిజీ బిజీ హీరోయిన్ . ఇంకా ఆమెకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ తో సినిమా తీయనున్న వివి వినాయక్ త్రిషనే హీరోయిన్ గా పెట్టుకోనున్నట్టు తెలిసింది. ఈ ఏడాది సంక్రాంతి సినిమాల్లో వివి వినాయక్ -త్రిషల సిన్మా హిట్ అయింది. వినాయక్ త్రిషను ఎన్టీఆర్ సిన్మాలోకి తీసుకుంటే ఆమె తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోలతోను నటించిన ఘనత దక్కించుకుంటుంది. త్రిష ఇప్పటివరకు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున (సిన్మా విడుదల కావలసి ఉంది)పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ ల సరసన నటించింది. నయనతార తెలుగులో దాదాపు రిటైర్ కావడడంతో త్రిషకు అవకాశాలున్నాయి.