విశాఖ ఎక్స్ ప్రెస్ లో ఎన్టీఆర్???
జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి, రాజీవ్ కనకాల మంచి ఫ్రెండ్స్. ఇపుడు రాజీవ్ కనకాల విశాఖ ఎక్స్ ప్రెస్ సినిమాలో అల్లరి నరేష్ తో కలిసి చేస్తున్నాడు. ఈ సినిమా ముళ్లపుడి వర దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాలో కొన్ని సీన్ లలో జూనియర్ ఎన్టీఆర్ నటించాలని రాజీవ్ కనకాల అనుకున్నాడు. నేరుగా అడిగితే బాగోదని ఎస్ఎస్ రాజమౌళిని అడిగించారు. అందుకు సమ్మతించి జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సీన్లలలో నటించినట్టు సమాచారం. డిసెంబర్ 7న విడుదల అవుతోంది. విజయ్ కురాకుల సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











