Just In
Don't Miss!
- News
కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్‌కు ఒత్తిడి -లవ్లీ గణేశ్
- Sports
టీమిండియాను విమర్శించిన స్టార్క్ సతీమణి.. మతిభ్రమించిందంటూ మండిపడ్డ ఫ్యాన్స్!
- Finance
6 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.13 లక్షల కోట్లు జంప్: టీసీఎస్, ఎయిర్టెల్ అదుర్స్
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జూనియర్ తీరుతో తమన్నా అవమాన భారం
ఊసరవెల్లి హీరో జూనియర్ ఎన్టీఆర్ తీరుతో ఆ సినిమా నటి తమన్నా అవమాన భారంగా ఫీలవుతోంది. వీళ్లిద్దరూ నటించిన ఊసరవెల్లి సినిమా ఆడియో గురువారం రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో విడుదలైంది. ఈ సందర్భంగా జూ.ఎన్టీఆర్ వేదికపై మాట్లాడుతూ...ఊసరవెల్లి సినిమా టీమ్ లోని ముఖ్య సభ్యలను తన దైన రీతిలో అభినందించాడు. వారిని స్వయంగా స్టేజిపైకి పిలిచి మరీ పొగడ్తలతో ముంచెత్తాడు.
అయితే...ఈ సినిమాలో తన తర్వాత ముఖ్య పాత్ర పోషించే హీరోయిన్ తమన్నా గురించి మాత్రం ఎన్టీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. హీరోయిన్లకు అసలే పబ్లిసిటీ, పొగడ్తల పిచ్చి ఉంటుంది. ఈ విషయంలో తమన్నా కూడా ఏమీ తీసిపోదు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తీరుతో తీవ్రంగా అప్ సెట్ అయిందట తమన్నారు. ఇలా జరుగడం అవమాన భారంగా ఫీలవుతుందట.
మరి తమన్నా అసంతృప్తి విషయం జూనియర్ చెవిలో పడిందో? లేదో గానీ ఫిల్మ్ నగర్ లో మాత్రం దీనిపై చర్చ సాగుతోంది. అయితే జూనియర్ సన్నిహితుల వాదన మరోలా ఉంది. జూనియర్ ఆమెను గురించి పొగిడితే ఈయనకు, ఆమెకు లింకు అంటగట్టి ప్రచారం చేస్తారని, ఈ కారణంగానే జూనియర్ ఇలా ప్రవర్తించాడని అంటున్నారు.