twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్పెయిన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ (వీడియో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా సుకమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో'. కొన్ని రోజులుగా ఈచిత్రం షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది. డిసెంబర్ 11తో స్పెయిన్ షెడ్యూల్ ముగిసింది. స్పెయిన్‌లో షూటింగ్ జరుగుతుండగా అక్కడి న్యూస్ ఛానల్ ఒకటి ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు సుకుమార్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లను ఇంటర్వ్యూ చేసింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సదరు ఛానల్ రిలీజ్ చేసింది.

    రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యంత కాస్ట్‌లియస్ట్‌ చిత్రంగా 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చాలా లావిష్‌గా చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు సుకుమార్‌ టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

    జనవరి 13న సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేశాం'' అన్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం విదేశాల్లోనే జరిగింది. 60 రోజులపాటు లండన్‌లో షూటింగ్ జరిగింది. తర్వాత స్పెయిన్ లోని రేర్ లొకేషన్లలో షూటింగ్ జరిపారు.

    యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

    English summary
    Tollywood star NTR Interviewed by Spain News Channel. Checkout video.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X