పెళ్ళి పిలుపుల్లో బిజీగా ఉన్న జూ ఎన్టీఆర్..మొదటి లేఖ బాబుకి...
జూనియర్ రాముడు మే 5న కళ్యాణ రాముడు కానున్న సంగతి అందరికి తెలిసిందే. లక్ష్మి ప్రణతి తో నందమూరి తారక రామరావు వివాహమహోత్సవానికి అవసరమైన పనులు మొదలైయ్యాయి. నార్నే, నందమూరి ఇళ్ళల్లో పెళ్ళి ఏర్పాట్ల హడావిడి కనిపిస్తుంది. జూ ఎన్టీఆర్ కూడా షూటింగులు పక్కన పెట్టి పూర్తిగా పెళ్ళి పనుల్లో నిమగ్నమయ్యాడు. ఇప్పటికే పెళ్ళికి సంబందించిన దుస్తులు, ఆభరణాల కొనుగోలు పూర్తైంది అని స్వయంగా జూనియర్ తెలియజేసాడు.
మరో పక్క జూ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కుమారుడి వివాహ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ పెళ్ళి పిలుపుల్లో తలమునకలై ఉన్నారు. గత కొద్దికాలంగా టీడిపిలో హరికష్ణ, చంద్రబాబుల మద్య అసమ్మతి స్వరం విన్సిస్తున్నా అది కాస్తా జూ పెళ్ళితో ఫుల్ స్టాప్ పెట్టిందని చెప్పొచ్చు. అదిఎలా అంటే ఆదివారంనాడు జూ ఎన్టీఆర్ తో కలిసి ఆయన తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్ళి జూ ఎన్టీఆర్ వివాహానికి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానిస్తూ శుభలేఖ అందజేసారు. ఇతర బంధువులను, ప్రముఖులను హరికృష్ణ స్వయంగా వెళ్ళి ఆహ్వానించనున్నారు.
మే 5న హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, మాదాపూర్ లో జూ ఎన్టీఆర్, ప్రణతి ల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వివాహానికి రాజకీయ, సినిమా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖలు హాజరు కానున్నారు. ఈ వివాహాన్ని 'నభూతో.. న భవిష్యత్' అన్న రీతిలో జరపాలని నార్నే, నందమూరి కుటుంబాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











