హీరోయిన్స్ కి ఎన్టీఆర్ పిలుపు
బాలీవుడ్ హీరోయిన్లు పలువురు తెలుగులో కూడా నటిస్తున్నారు. ముంబైకి చెందిన ఇంచుమించు అందరి హీరోయిన్లతో ఎన్టీఆర్ నటించారు. ఇవాల్టి యంగ్ జనరేషన్ హీరోలను లీడ్ చేస్తున్న వారిలో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. అతను చొరవ తీసుకుని బాలీవుడ్ హీరోయిన్లను స్టార్ నైట్ కు రప్పించే బాధ్యత తీసుకోవాలి అని మోహన్ బాబు ఓ ప్రతిపాదన చేశారు.దాంతో హీరోయిన్స్ ని స్టార్ నైట్స్ కి రప్పించే భాధ్యత ఎన్టీఆర్ పై పడింది. యమదొంగ చిత్రం నాటినుండి ఇద్దరి మధ్యా మంచి ర్యాప్ ఏర్పడింది. అది పురస్కరించుకుని మోహన్ బాబు ఈ ప్రపోజల్ చేసారు.దాంతో రాష్ట్రంలో ఏర్పడిన వరదల కారణంగా నష్టపోయిన ప్రజానీకాన్ని అదుకునేందుకు పరిశ్రమలోని అన్ని శాఖల సమన్వయంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసోయేషన్ (మా) నవంబర్ 7న తలపెట్టిన 'స్టార్ నైట్'కు సంబంధించిన ఓ పెద్ద బాధ్యత ఎన్టీఆర్ భుజాలపై పెట్టారు. ఇక ఈ విషయమై ఎన్టీఆర్ అప్పుడే ఫోన్ లు చేయటం, కొందరని పర్శనల్ గా కలవటం చేస్తున్నారు. దాంతో ముంబయిలో ఉన్నవారు, ఆ రోజు బిజీగా ఉన్నవారు సైతం రిహార్శల్ కి అటెండవటానికి సరే అంటున్నారు.


Click it and Unblock the Notifications











