»   » ఎన్టీఆర్‌‌ను అతిగా పొగిడేస్తున్న హరీష్ శంకర్!

ఎన్టీఆర్‌‌ను అతిగా పొగిడేస్తున్న హరీష్ శంకర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
NTR is an effortless performer : Harish Shankar
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలను తన ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడంతో పాటు....వీలు చిక్కినప్పుడల్లా ఎన్టీఆర్‌ను పొగడ్తలతో మునగచెట్టెక్కిస్తున్నాడు హరీష్ శంకర్.

తాజాగా మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు హరీష్. 'ఎన్టీఆర్ ఎఫర్ట్‌లెస్ పెర్ఫార్మర్. డాన్స్ అయినా, డైలాగ్ అయినా, ఫైట్ అయినా....ఎన్టీఆర్ సులభంగా చేస్తారు' అంటూ ట్వీట్ చేసారు. ఇలా చెప్పడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ గొప్ప హీరో అని చెప్పకనే చెబుతున్నాడు హరీష్.

గతంలో ఓ సారి కూడా ఇలాంటి పొగడ్తలే గుప్పించాడు ఈ దర్శకుడు. 'జూ ఎన్టీఆర్ లాంటి సింగిల్ టేక్ ఆర్టిస్టుతో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయనతో పని చేస్తే షూటింగ్ ఆలస్యం అవుతుందనే టెన్షనే ఉండదు. ఆయనది నమ్మశక్యంకాని మెమోరీ పవర్' అంటూ ట్వీట్ చేసాడు. మరి ఈ పొగడ్తలన్నీ దేనికోసమో...? అర్థం చేసుకోలేనంత అమాయకులా ప్రేక్షకులు!

సినిమా వివరాల్లోకి వెళితే...ఈచిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 27న విడుదల చేసి తీరుతామని అంటున్నారు దర్శక నిర్మాతలు. ఆగస్టు మూడో వారంలో ఆడియో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.

బాద్‌షా తర్వాత ఎన్టీఆర్‌, గబ్బర్‌సింగ్‌ తర్వాత హరీశ్‌ శంకర్‌ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

English summary
“NTR is an effortless performer. Whether it is dance or dialogue or fight, it is a cake walk for Young Tiger”, Harish Shankar tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu