twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్‌కు పొగరెక్కువ: కాజల్ సంచలన వ్యాఖ్య

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్‌కు పొగరు ఎక్కువే అంటూ సంచలన ప్రకటన చేసింది హీరోయిన్ కాజల్. ఓ ఆంగ్ల అంతర్జాల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.... 'నేను ఇష్టపడే తెలుగు హీరోల్లో జూ ఎన్టీఆర్ ఒకరు. అతడు మంచి నటుడే కాదు నిజాయితీ పరుడు. అదే విధంగా అతనికి పొగరు కాస్త ఎక్కువే. అహం భావం అనేది నిజాయితీలో ఓ భాగం. అందుకే అతనంటే నాకు ఇప్పటికీ ఇష్టం' అని వ్యాఖ్యానించింది కాజల్.

    మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? అని అడిగిన ప్రశ్నకు కాజల్ పై విధంగా సమాధానం ఇచ్చింది. అదే విధంగా తమిళంలో విజయ్‌ తన ఫేవరెట్‌గా పేర్కొంది. ఇంకా పలు విషయాలను వెల్లడిస్తూ తనకు తమిళ ఇండస్ట్రీ కంటే తెలుగు పరిశ్రమ అంటేనే ఇష్టమని, ఇక్కడ హీరోలతో పాటు హీరోయిన్లకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. కానీ తమిళ పరిశ్రమలో హీరోకి ఉన్నంత రెస్పెక్ట్ హీరోయిన్‌కి ఉండదు అని చెప్పుకొచ్చింది కాజల్.

    ఇటీవలే తెలుగులో 'నాయక్' చిత్రంతో హిట్ కొట్టిన కాజల్ ప్రస్తుతం జూ ఎన్టీఆర్ తో 'బాద్ షా' చిత్రంలో నటిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న 'బాద్ షా' చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై బండ్ల గణేష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ ఇటలీ, స్విట్జర్లాండ్, బ్యాంకాక్ లలో జరిగింది. కొన్ని సీన్లను మాత్రం హైదరాబాద్ లో చిత్రీకరించారు.

    ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    ‘In Telugu, I like Junior NTR. He is not only a good actor, but is honest. He is arrogant, but I still like him as arrogance is also a part of honesty’ Kajal told to TOI.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X