మహేష్ అమృతాంజనం అయితే జూ ఎన్టీఆర్ జెండుబామ్
మొత్తానికి జూ.ఎన్టీఆర్ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. తలనొప్పి నివారణ కి ఉపయోగించే జెండూబామ్ కి ఆయన తాజాగ సైన్ చేసారు. మహేష్ బాబు అమృతాంజన్ ని బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేస్తూండటంతో మెయిన్ కాంపిటేటర్ అయిన జెండూ బామ్ వారు యూత్ లో క్రేజ్ ఉన్న జెండూ బామ్ కి ఎన్టీఆర్ ని తీసుకున్నారు. ఇక చాలా కాలంగా చాలా కంపెనీలు ఎన్టీఆర్ ని కమర్షియల్ యాడ్స్ కి ఒప్పించటానకి ట్రై చేసాయి కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. అయితే సీనియర్ హీరోలు, నాగార్జున, వెంకటేష్ లు కూడా తలో బ్రాండ్ ని ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉండటంతో ఎన్టీఆర్ కూడా ఓకే చేసారు. మొత్తానికి తెలుగు వారి తలనొప్పిని తగ్గించటానకి ఇద్దరు తెలుగు హీరోలు రెడీ అయ్యారన్నమాట.
మహేష్ బాబు అమృతాంజన్ జూ ఎన్టీఆర్ జండూ బామ్ రామ్ చరణ్ ధమ్స్ అప్ mahesh babu amrutanjan jr ntr jandu balm ram charan thums up


Click it and Unblock the Notifications