రామ్ చరణ్‌కు పోటీగా.... ఎన్టీఆర్‌ను ‘సెలక్ట్’ చేశారు
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీలో నటించబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్లో రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ మూవీ రాబోతోంది. ఈ నేపథ్యంలో కొర్పొరెట్ సంస్థల దృష్టి ఈ ఇద్దరు యంగ్ హీరోలపై పడింది. వీరితో పోటాపోటీగా తమ బ్రాండ్ ప్రమోషన్స్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు.
'హప్పి' అనే మొబల్స్ స్టోర్ సంస్థ ఇటీవల రామ్ చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న సంగతి తెలిసిందే. 'హప్పి' మొబైల్ స్టోర్ పోటీగా 'సెలక్ట్' అనే మరో మొబైల్ స్టోర్ సంస్థ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్‌ను ఎంచుకుంది.
శుక్రవారం హైదరాబాద్‌లో జరిగే 'సెలక్ట్' మొబైల్ బ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఇప్పటికే పలు కార్పొరేట్ బ్రాండ్లకు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

తారక్ నటిస్తున్న నటిస్తున్న సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' అనే చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో #ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించబోతున్నారు.


Click it and Unblock the Notifications











