»   » ఎన్టీఆర్‌ కి నత్తి ఉంటుందా..? ఇదేం ట్విస్టు?

ఎన్టీఆర్‌ కి నత్తి ఉంటుందా..? ఇదేం ట్విస్టు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ యంగ్ జ‌న‌రేష‌న్ హీరోల్లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ది ప్ర‌త్యేక‌మైన శైళి. డ్యాన్సుల్లో కానీ డిఫ‌రెంట్ గెట‌ప్స్‌లో న‌టించి మెప్పించ‌డంలో కానీ ఎన్టీఆర్ ముందుంటాడు. ఇందుకు ఉదాహ‌ర‌ణ అదుర్స్ ఛారి క్యారెక్ట‌ర్‌. అలాంటి మ‌రో విల‌క్ష‌ణ పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌బోతున్నాడ‌ట‌.

ఏదో ఒక లోపం ఉన్నట్టు

ఏదో ఒక లోపం ఉన్నట్టు

వయసు మీరిన పాత్రలు చేయడంతో పాటు.. ఏదో ఒక లోపం ఉన్నట్టు నటించేందుకు కూడా వెనకాడ్డం లేదు హీరోలు. సుకుమార్ మూవీలో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటిస్తున్నాడు. అంధగాడులో రాజ్ తరుణ్.. రాజా ది గ్రేట్ లో రవితేజ పూర్తిగా అంధుడి పాత్రలు పోషిస్తున్నారు.

జై పాత్ర లో నెగిటివ్ షేడ్స్

జై పాత్ర లో నెగిటివ్ షేడ్స్

ఇప్పుడీ ట్రెండ్ ఎన్టీఆర్ వరకూ పాకేసింది. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో జై లవ కుశ అనే చిత్రంలో యంగ్ టైగర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జై పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని.. సినిమాకి ఇదే విలన్ రోల్ అని ప్రచారం జరుగుతోంది. ఏదో ఒక డిసేబిలిటీ ఉంటే పర్ఫార్మెన్స్ కి మరింత అవకాశం ఉంటుందని భావించారట

నెగిటివ్ రోల్

నెగిటివ్ రోల్

మరోవైపు ఈ పాత్రకు నత్తి కూడా ఉంటుందట. అసలే నెగిటివ్ రోల్.. అందులోనే ఆవేశం చూపించే పాత్ర.. దీనికితోడు మ్యానరిజంగా నత్తిని కూడా తగిలించి ఈ రోల్ ని పెర్ఫార్మెన్స్ పరంగా మరో మెట్తు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి తండ్రి పాత్ర అయితే .. మిగతా రెండు పాత్రలు ఆయన పిల్లలు (ట్విన్స్) గా కనిపిస్తారని ప్రచారం జరిగింది.

'నత్తి'తో

'నత్తి'తో

అయితే ఈ ప్రచారంలో నిజం లేదనేది తాజా సమాచారం. ఈ సినిమాలో పోసానికి ఇద్దరు భార్యలు వుంటారట. ఆ ఇద్దరు భార్యలకు జన్మించిన ముగ్గురు పిల్లల కథ ఇదని తెలుస్తోంది. ఈ మూడు పాత్రలను ఎన్టీఆర్ పోషిస్తున్నాడు. 'జై' అనే పాత్ర నెగెటివ్ షేడ్స్ తో .. 'నత్తి'తో కనిపిస్తుందని అంటున్నారు.

దసరా నాటికి

దసరా నాటికి

ఈ విషయం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచడం ఖాయమని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దసరా నాటికి సినిమాను విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్. ఈ రోజు ఉదయమే విడుదలైన మోషన్ పోస్టర్ కూడా అప్పుడే వైరల్ అయ్యింది. ఒకరికొకరు షేర్ చేసుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు తారక్ ఫ్యాన్స్.

English summary
NTR27 finally has a name and it is officially called Jai Lava Kusa. On the auspicious occasion of Rama Navami, the makers revealed the motion poster and the title of the film that is among the most awaited in the Telugu industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu