జపాన్ లోనూ జూ ఎన్టీఆర్ కు..
ఇన్నాళ్ళుగా రజనీకాంత్ కు జపాన్ లో క్రేజ్ ఉందని వింటూ ఉన్నాం.అయితే ఇప్పుడు తెలుగు హీరో జూ.ఎన్టీఆర్ కి సైతం అక్కడ క్రేజ్ వచ్చిందని తెలుస్తోంది. అతను నటించిన అశోక్ చిత్రంలోని గోల గోల రంగోలా పాట అక్కడ పాపులర్ అని చెప్తున్నారు. ఆ పాటను అక్కడ పాపులర్ అయిన ప్యూజీ ఛానెల్ వారు ప్రసారం చేసారట. తమ భాషలోకి రీమిక్స్ చేసి ఈ పాటను అక్కడ వదిలారట. దాంతో అక్కడ ఆ పాట వైరైటీగా కనిపించి చాలా మందికి ఇష్టమైన సాంగ్ అయ్యిందిట. అలాగే అక్కడ స్టేజి షో ల మీద కూడా ఆ పాటను ప్లే చేసి డాన్స్ చేస్తున్నారట. దాంతో ఆ ఛానెల్ వారు జూ.ఎన్టీఆర్ ని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి ఇంటర్వూ చేసారట. ఇదంతా ఇప్పుడు అంతటా వినపడుతున్న హాట్ టాపిక్. అయితే దీన్ని కేవలం ఊసరవిల్లి చిత్రం ప్రమోషన్ కోసం పుట్టించిన రూమర్ గా కొట్టిపారేస్తున్నారు. ఎన్టీఆర్ ఎన్నో హిట్ పాటలు ఉండగా..ఇప్పుడే సురేంద్ర రెడ్డి డైరక్ట్ చేసిన ప్లాప్ సినిమాలో పాట ఎందుకు హఠాత్తుగా అదీ ఊసరవిల్లి రిలీజ్ టైమ్ లో ఎందుకు క్రేజ్ తెచ్చుకుంటుందని లాజిక్ తీస్తున్నారు.
ఇక అశోక్ చిత్రానికి కూడా సురేంద్ర రెడ్డే దర్శకుడు కావటం వారి మాటలకు బలా న్ని ఇస్తోంది. ఇక ఈ టాపిక్ పై పాపులర్ టీవీ ఛానెల్ పోగ్రాం చేసి ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకోవటం మరో విశేషం. కిక్' వంటి సూపర్ హిట్ తర్వాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆద్విక్ మహాజన్, మురళీశర్మ, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, అజయ్, ఎమ్మెస్ నారాయణ, పాయల్ ఘోష్, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, జీవీ, విద్యుత్ జమ్వాల్, బెనర్జీ తారాగణమైన ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, చంద్రబోస్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: బి. బాపినీడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











