»   »  బాహుబలి : జూ ఎన్టీఆర్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది!

బాహుబలి : జూ ఎన్టీఆర్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడే సినిమాగా నిలిచింది. గతేడాది విడుదలైన తొలి భాగం 'బాహుబలి-దిబిగినింగ్' చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. అందుకు కారణం హాలీవుడ్ స్థాయిలో ఒక తెలుగు సినిమా రావడం ఇదే తొలిసారి. తెలుగునాట మాత్రమే కాదు...ఇండియా వ్యాప్తంగా బాహుబలి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. జాతీయ అవార్డు కూడా రావడంతో గొప్ప సినిమాల లిస్టులో చేరిపోయింది బాహుబలి.

ఇలాంటి గొప్ప సినిమాలో తాము భాగమైతే బావుండు... అని అనుకున్న స్టార్స్ ఎందరో ఉన్నారు. కొందరైతే బహిరంగంగానే తమకు కనీసం బాహుబలి-2లో అయినా అవకాశం ఇవ్వాలని కోరారు. ఇలాంటి తరుణంలో 'బాహుబలి-2'లో జూ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

పైగా రాజమౌళి, ఎన్టీఆర్ చాలా క్లోజ్. దీంతో బాహుబలి-2లో ఎన్టీఆర్ నటిస్తున్నాడనే విషయం నిజమే అనుకున్నారు. తాజాగా ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించడం లేదని తేలిపోయింది. అసలు రాజమౌళి, ఎన్టీఆర్ మధ్య అటువంటి ప్రపోజల్ ఏమీ రాలేదని వారి సన్నిహితులు అంటున్నారు.

NTR is not going to feature in Baahubali

'బాహుబలి-2' ప్రస్తుతం జరుగడం లేదు. నెలరోజులు సినిమా షూటింగుకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సెట్స్‌కు సంబంధించిన పనులు, ట్రైనింగ్ సెషన్స్ ఉండటంతో షూటింగుకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందని నిర్మాత తెలిపారు.

మళ్లీ జూన్ నెలలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాదే సినిమా షూటింగ్ పూర్తి చేసి... వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బహుబలి తొలి భాగానికి వచ్చిన రెస్పాన్స్ దృష్ట్యా రెండో భాగాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా, ఎలాంటి లోపాలు లేకుండా తెరకెక్కిస్తున్నారు.

English summary
Many believed this rumors because, Rajamouli and NTR are good friends in real life and due to this all believed that NTR is going to feature in the “Baahubali: The Conclusion”. But from the close sources we heard that, “As of now, there is no such proposal”. NTR is not going to feature in Baahubali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu