అవాస్తవం : జూ ఎన్టీఆర్ సీక్రెట్ ఏజెంట్ పాత్రపై కోన వెంకట్
నందమూరి యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో చేస్తున్న 'బాద్ షా' చిత్రంలో సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించబోతున్నాడని కొన్ని రోజులుగా ఓ వార్త వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదంటున్నారు ఈ చిత్ర స్టోరీ రైటర్ కోన వెంకట్.
కోన వెంకట్ తన ట్విట్టర్లో స్పందిస్తూ...'బాద్ షా చిత్రంలో ఎన్టీఆర్ సీక్రెట్ ఏజెంటుగా కానీ, జేమ్స్ బాండ్ పాత్రలో కానీ నటించడం లేదు. ఇదొక గుడ్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్. లవ్, ఫ్యామిలీ మసాలాతో పాటు అభిమానులు మెచ్చే అన్ని అంశాలు ఉంటాయి' అని చెప్పుకొచ్చారు.
ఈ చిత్రం షూటింగ్ జులై 9 నుంచి ఇటలీలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి నాటికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
బాద్ షా చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రం పాటలు ఆగస్టు, సెప్టెంబర్ వరకు వినే అవకాశం ఉంది. గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దూకుడు తర్వాత శ్రీను వైట్ల చేస్తున్న చిత్రం కావటంతో సినిమాపై ఓ రేంజి అంచనాలు ఉంటాయనటంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications











