దటీజ్ పవన్ కల్యాణ్.. ఎన్టీఆర్‌ను డిసైడ్ చేసింది పవర్‌స్టార్ అట..
పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ ఓ చిత్రాన్ని ఆరంభించారు. ఈ చిత్ర ముహుర్తం షాట్‌కు పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టిన సంగతి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉన్న అనుబంధం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్‌ను షేర్ చేశాయి. ప్రస్తుతం పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ ఓ చిత్రాన్ని ఆరంభించారు. ఈ చిత్ర ముహుర్తం షాట్‌కు పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

పవన్ కోసం త్రివిక్రమ్ కథ
పవన్ కల్యాణ్ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలోనే త్రివిక్రమ్ ఓ కథను రాసుకొన్నాడట. ఆ కథకు పవన్ అయితే చాలా బాగుంటుందని ఆయనకు కథ చెప్పాడట. త్రివిక్రమ్ చెప్పిన కథ పవన్‌కు కూడా నచ్చిందట. అయితే తాను ఆ కథ తనకు సూట్ కాదని చెప్పడంతో ఎవరికైతే బాగుంటుంది అనే ప్రశ్న వచ్చిందట.

ఎన్టీఆర్ అయితే కరెక్ట్
త్రివిక్రమ్ రూపొందించిన కథకు ఎన్టీఆర్ జూనియర్ అయితే కచ్చితంగా సరిపోతాడు అనే సూచనను కూడా పవన్ ఇచ్చారట. దాంతో త్రివిక్రమ్ కథను ఎన్టీఆర్‌కు వినిపించడం, ఆ తర్వాత సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట.

వరుస విజయాలతో ఎన్టీఆర్
టాలీవుడ్‌లో హీరోల మధ్య మంచి కాంపిటిషన్ ఉంది. ఇప్పటికే నాలుగు వరుస విజయాలతో ఎన్టీఆర్ దూసుకెళ్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో బలమైన హీరో పేరును మరో హీరో చెప్పడం ఊహించలేం.

పవన్ వ్యక్తిత్వం అదీ..
కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఎన్టీఆర్ పేరును సూచించడం గురించి పవన్ వ్యక్తిత్వం ఏంటో అర్థమైంది. ఇప్పటికే ఎంతో మంది హీరోలకు, నటీనటులకు పవన్ అండగా నిలబడటం తెలిసిందే.

తొలిషాట్‌కు పవన్ కల్యాణ్
అంతేకాకుండా స్వయంగా ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. తొలి ముహూర్తం షాట్‌కు పవన్ క్లాప్ కొట్టి తోటి హీరోను గౌరవించడంపై సినీ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది.

హ్యాట్రిక్ కోసం పవన్, త్రివిక్రమ్
ఇదిలా ఉండగా పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమవుతున్నది. గతంలో వీరి కాంబినేషన్‌లో జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాలు పవన్ కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్లుగా మారిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











