RRRలో ఎన్టీఆర్‌ సీన్‌ డిలీట్‌.. అది ఉండుంటే మరో లెవల్.. అసలు విషయం బయటపెట్టిన నటుడు

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుత దృశ్యకావ్యం RRR ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించారు. అయితే రామ్ చరణ్ పాత్ర ఎన్టీఆర్ పాత్రను డామినేట్ చేసినట్లు ఉందని ముందు నుంచి ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో రామ్ చరణ్ సహా రాజమౌళి కూడా ఈ విషయం పై స్పందించారు. అయితే తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని ఎలివేషన్ సీన్స్ డిలీట్ అయిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏమిటా సీన్లు? ఏమిటా కథ? అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

RRR

RRR

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సుదీర్ఘ కాలం తెరకెక్కి ఈ మధ్య కాలంలో విడుదలైన చిత్రం RRR. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన రెండు పెద్ద కుటుంబాలకు చెందిన నటులు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాలో అనేక మంది ఇతర భాషలకు చెందిన నటీనటులు కూడా నటించారు. అజయ్ దేవగన్, శ్రేయ, సముద్రకని, మకరంద్ దేశ్ పాండే, అలాగే హాలీవుడ్ కు చెందిన మరికొంతమంది నటీనటులు కూడా సినిమాలో భాగమయ్యారు.

 షాకింగ్ అంశం వెలుగులోకి

షాకింగ్ అంశం వెలుగులోకి

ఇక రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్ర సరసన సీత అనే పాత్రలో అలియా భట్ నటించగా, ఒలీవియా మోరిస్ కొమురం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ సరసన జెన్నీ అనే బ్రిటిష్ యువతి పాత్రలో నటించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక షాకింగ్ అంశం వెలుగులోకి వచ్చింది, అది ఏమిటి అంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఒక విధంగా ఎలివేట్ చేసే ఒక సీన్ ని రాజమౌళి కత్తిరించారు అని తేలింది.

కట్ చేశారని

కట్ చేశారని

ఆ విషయాన్ని ఈ సినిమాలో సదరు కత్తిరించిన సీన్ లో నటించిన నటుడు మణి కిరణ్ బయటపెట్టారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. తారక్ కు సంబంధించిన ఒక పవర్ఫుల్ సీన్ రాజమౌళి కట్ చేశారని సదరు నటుడు చెప్పుకొచ్చాడు. అదేమిటి అంటే ఎన్టీఆర్ ను రామ్ చరణ్ కొరడాతో కొట్టిన తర్వాత ఈ సీను ఉంటుందని ఆయన అన్నారు.

సత్తా ఏమిటో చూపించారని

సత్తా ఏమిటో చూపించారని

ఎన్టీఆర్ ను కొరడాతో కొట్టిన తర్వాత బ్రిటిష్ సైన్యం ఆయనను జైల్లో పెడుతుంది కదా, అదే జైలులో కొంతమంది తెలుగు ఖైదీలు ఉంటారు, ఆ ఖైదీలలో ఒకటిగా నేను కనిపించాల్సి ఉందని అన్నారు. జైల్లో పెట్టిన తర్వాత ఎన్టీఆర్ ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా కూర్చుని ఉంటాడని, తెలుగు మాట్లాడే మేము ఆయన దగ్గరికి వెళ్లి బ్రిటిష్ వాళ్లను ఎదిరించి మేము ఇలా జైల్లో ఉన్నాము కానీ మీరు మాత్రం వాళ్లను కొట్టి భారతీయుల సత్తా ఏమిటో చూపించారని ఆయనను పొగుడుతూ ఉంటామని అన్నారు.

థియేటర్ లో పడి ఉంటే

థియేటర్ లో పడి ఉంటే


ఇక మీదట మీరే మా నాయకుడు అని మీవెంటే మేము నడుస్తాము అంటూ నినాదాలు చేస్తామని చెప్పుకొచ్చాడు.. ఆ సమయంలో మాలో కనిపించే ఆ ఉక్రోషం, ఎమోషన్స్ ఒక రకంగా గూంజ్ బంప్స్ తెప్పిస్తాయని, ఈ సీన్ గనుక థియేటర్ లో పడి ఉంటే సినిమా మరో లెవెల్ లో ఉండేదని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే నిడివి బాగా పెరిగిపోవడంతోనే రాజమౌళి ఈ సీన్ కత్తిరించి ఉండవచ్చని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X