ఎప్పుడూ లేని ఎన్టీఆర్ కు కూడా జెండుబామ్ అవసరమైందా...
రామ్ చరణ్ పెప్సీ, మహేష్ బాబు థమ్స్ అప్ ఇలా తెలుగు క్రేజీ హీరోలందరూ సైడ్ బిజినెస్ గా కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్నారు. గత కొన్నాళ్ళుగా పలు కంపెనీలు ప్రయత్నించినప్పటికీ ఎన్టీఆర్ కమర్షియల్ యాడ్స్ లో నటించటానికి అంగీకరించడం లేదు. ఇక సినిమాలకన్నా కమర్షియల్ యాడ్స్ లో ఎక్కువ పబ్లిసిటి లభిస్తుందని జూ ఎన్టీఆర్ అనుకున్నాడో ఏమో కానీ ఎట్టకేలకు ఆయన యాడ్ లో నటించటానికి అంగీకరించారు. అదే జండూబామ్. త్వరలోనే ఎన్టీఆర్ జండూబామ్ సీసా పట్టుకొని టీవీల ముందు ప్రత్యక్షమవుతాడు.
ఇప్పటికే ఒప్పందాలు గట్రా కూడా జరిగిపోయి ఎన్టీార్ ఆ యాడ్ షూటింగ్ లో పాల్గొనడానికి ముంబాయ్ కూడా వెళుతున్నాడు. రేపట్నుంచి ఆ యాడ్ షూటింగ్ జరగుతుంది. మళ్లీ డిసెంబర్ 13కి తిరిగి హైదరాబాద్ చేరుకుంటాడు. ప్రస్తుతం అమృతాంజన్ కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. అతనితో సమానమైన స్టార్ డమ్ ఉన్న ఎన్టీార్ ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకింది. తలనొప్పి బాధలు తగ్గే ఈ రెండు బామ్ లకు తెలుగు సినీ హీరోలే ప్రచార కర్తలు కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం.


Click it and Unblock the Notifications