»   »  నందమూరి బ్రదర్స్... ఇంత హ్యాపీగా ఎప్పుడూ లేరు (ఫోటోస్)

నందమూరి బ్రదర్స్... ఇంత హ్యాపీగా ఎప్పుడూ లేరు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనతా గారేజ్ చిత్రం తో పలు రికార్డులు తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం, సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో తెరకెక్కనుంది. పవర్ సినిమా తో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రం పూజా కార్యక్రమం నేడు ఎన్టీఆర్ ఆర్ట్స్ కార్యాలయం లో ఘనం గా జరిగింది.

నందమూరి హరికృష్ణ , నందమూరి రామకృష్ణ, దర్శకులు వి వి వినాయక్, దిల్ రాజు, శిరీష్, భోగవల్లి ప్రసాద్, యలమంచిలి రవి శంకర్, కిలారు సతీష్, ఎస్ రాధాకృష్ణ, సూర్యదేవర నాగ వంశి తదితరులు పూజా కార్యక్రమానికి విచ్చేసారు. తొలి షాట్ కి ఎన్టీఆర్ క్లాప్ ఇవ్వగా, నందమూరి హరికృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చూసారు. దేవుడి పఠాల పై తొలి షాట్ కు వి . వి . వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.

 ఎన్టీఆర్

ఎన్టీఆర్

ఈ చిత్రం లో ఒక హీరోయిన్ గా రాశీ ఖన్నా ను ఇప్పటికే ఖరారు చేసారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రానికి సి. కె. మురళీధరన్ సినిమాటోగ్రఫీ అందిస్తారు. 'టెంపర్ ' , 'నాన్నకు ప్రేమతో', 'జనతా గారేజ్ ' చిత్రాలతో భారీ హ్యాట్ ట్రిక్ ను అందుకున్న ఎన్టీఆర్ మళ్ళీ సరికొత్త లుక్ తో ఈ నూతన చిత్రం లో కనిపించనున్నారు.

 కళ్యాణ్ రామ్ ఆనందం

కళ్యాణ్ రామ్ ఆనందం

నిర్మాత కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, " సోదరుడు ఎన్టీఆర్ తో , ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై #NTR27 చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందం గా ఉంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయి లో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మిస్తామని తెలిపారు.

 షూటింగ్ విశేషాలు

షూటింగ్ విశేషాలు

దర్శకుడు బాబీ చెప్పిన స్టోరీ ఎన్టీఆర్ లో ని స్టార్ కి , నటుడు కి న్యాయం చేసే విధం గా ఉంది. ఫిబ్రవరి 15 నుండి చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది" అని అన్నారు.

 రిలీజ్ ఎప్పుడంటే

రిలీజ్ ఎప్పుడంటే

ఈ ఏడాది ద్వితీయార్ధం లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ తెలిపింది. ఈ చిత్రం లోని నటీ నటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియ చేయబడతాయి

English summary
After scoring a solid blockbuster with 'Janatha Garage', Young Tiger NTR is all set to begin work on his next project. This prestigious #NTR27 project will be produced by Nandamuri Kalyan Ram on NTR Arts banner and K.S. Ravindra (Bobby), who made his debut with 'Power', is going to direct this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu