twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం'.. అక్క కోసం జూ.ఎన్టీఆర్ రాజకీయ పలుకులు!

    |

    Recommended Video

    Telangana Elections 2018 : సుహాసిని ఎంట్రీ పై జూ.ఎన్టీఆర్ ట్వీట్ | Oneindia Telugu

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తూ రాజమౌళి చిత్రానికి రెడీ అవుతున్నాడు. తన తండ్రిని కోల్పోయిన విషాదాన్ని దిగమింగుతూనే అరవింద సమేత చిత్రాన్ని ఎన్టీఆర్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. హరికృష్ణ మరణం తరువాత ఎన్టీఆర్, బాలయ్య మధ్య ఎమోషనల్ బాండింగ్ మరింతగా పెరిగింది. ఎన్టీఆర్ అరవింద సమేత సక్సెస్ మీట్ కు హాజరైన బాలయ్య జోహార్ హరికృష్ణ అంటూ జైకొట్టారు. తాను, ఎన్టీఆర్ చేసే చిత్రాలు మరెవరూ చేయలేరని నందమూరి అభిమానులని ఖుషి చేసాడు. దీనితో ఎన్టీఆర్ గురించి అభిమానుల్లో మరోమారు రాజకీయ చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా చాలా కాలం తరువాత ఎన్టీఆర్ నోటి నుంచి రాజకీయ పలుకులు జాలువారాయి.

    కూకట్ పల్లి నియోజకవర్గం

    కూకట్ పల్లి నియోజకవర్గం

    హరికృష్ణ మరణం తరువాత సెంటిమెంట్స్, ఎమోషన్స్ నెలకొని ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలుగు దేశం పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గ టికెట్ ని హరికృష్ణ కుమార్తె సుహాసినికి కేటాయించారు. తొలిసారి రాజకీయ అడుగులు వేస్తున్న అక్క కోసం సోదరులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ విడుదల చేసిన ప్రకటన వైరల్ గా మారింది.

     ట్విట్టర్ వేదికగా

    ట్విట్టర్ వేదికగా

    నీ కొత్త జర్నీకి ఆల్ ది బెస్ట్ అక్కా అంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశాడు. సమాజ సేవలో తొలి అడుగులు వేస్తున్న మా సోదరి సుహాసిని గారికి శుభాకాంక్షలు అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఉమ్మడిగా తెలుగు దేశం పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిరేపుతున్నాయి. ఎన్టీఆర్ గతంలో తెలుగు దేశం పార్టీ కోసం ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.

    ప్రజలే దేవుళ్ళు.. సమాజమే దేవాలయం

    ప్రజలే దేవుళ్ళు.. సమాజమే దేవాలయం అని భావించిన మా తాత స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మాకు చాలా పవిత్రం అని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అన్నారు. తమ తండ్రి హరికృష గారు తెలుగు దేశం పార్టీకి సేవలందించారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మా అక్క సుహాసిని గారు రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిపారు.

    స్త్రీలు ఉన్నతమైన పాత్ర

    సమాజసేవలో స్త్రీలు ఉన్నతమైన పాత్ర పోషించాలని మా కుటుంబం బలంగా విశ్వసిస్తుంది. అదే స్పూర్తితో మా సోదరి కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆమె విజయం సాధించాలని కోరుతున్నట్లు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రకటించారు.

     ఉమ్మడి రాష్ట్రంలో

    ఉమ్మడి రాష్ట్రంలో

    2009లో ఎన్టీఆర్ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటించి తెలుగుదేశం పార్టీకి ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో ఎన్టీఆర్ ప్రమాదానికి కూడా గురయ్యాడు. ఎన్నికలు ముగిసాక ఎన్టీఆర్ తన సినిమాలతో బిజీ అయిపోయాడు. ఆ తరువాత ఎన్టీఆర్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి. సోదరి కోసం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రచారం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    English summary
    NTR and Kalyan Ram wish their sister Suhasini for Political journey. Here is the details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X