twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఎన్టీఆర్' ప్రీమియర్ షో టాక్: సింపుల్‌గా సైకిల్‌పై.. ఆ రెండు సీన్స్‌‌లో దుమ్ముదులిపిన బాలయ్య!

    |

    Recommended Video

    NTR Kathanayakudu Premier Show Talk : Two Scenes Are Highlight In Movie | Filmibeat Telugu

    స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర సంక్రాంతి సందడి మొదలైంది. నేడు ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు నేడు విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రలో నందమూరి అభిమానులంతా థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. దర్శకుడు క్రిష్ రూపొందించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రారంభమైన ప్రీమియర్ షోలలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది.. ఏ మేరకు ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం సంతృప్తి నిచ్చేవిధంగా ఉందొ ఇప్పుడు చూద్దాం!

    ఎన్నో విశేషాలు

    ఎన్నో విశేషాలు

    ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో అద్భుత ఘట్టాలు,అంతకు మించిన ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ తన సినీ జీవితంలో ఏఎన్నార్, సావిత్రి, శ్రీదేవి, జయప్రద, రేలంగి లాంటి గొప్ప నటులతో వెండితెర పంచుకున్నారు. ఇలాంటి ఆసక్తికరమైన పాత్రల కోసం దర్శకుడు అందుకు సరిపడే నటుల్ని ఎంచుకున్నారు. ఏఎన్నార్ పాత్రలో హీరో సుమంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సావిత్రిగా నిత్యామీనన్ నటిస్తోంది. శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ మెరిసింది.

    'ఎన్టీఆర్ కథానాయకుడు' ట్విట్టర్ రివ్యూ: సెకండ్ హాఫ్ కేక .. బాలయ్య ఆ సీన్స్‌లో అదుర్స్!

    రియల్ లైఫ్ పాత్రలు

    రియల్ లైఫ్ పాత్రలు

    ఇక ఎన్టీఆర్ రియల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించింది. హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటించాడు. ఇక అత్యంత కీలకమైన చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటించడం విశేషం. రానా పాత్ర ఎక్కువగా ఎన్టీఆర్ మహానాయకుడులో ఉండనుంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్ర ప్రదర్శన తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రారంభమైంది.

    మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి.. మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..

    సింపుల్‌గా ఎంట్రీ

    సింపుల్‌గా ఎంట్రీ

    అభిమానుల ఉత్కంఠకు తెరపడింది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం థియేటర్స్ లోకి వచ్చేసింది. తన తండ్రి నందమూరి తారక రామారావు పాత్రలో బాలయ్య సింపుల్ గా సైకిల్ పై ఎంట్రీ ఇచ్చారు. బాలయ్య ఎంట్రీ ఫ్యాన్స్ పండగ చేసుకునే విధంగా ఉందని చెప్పొచ్చు. విద్యాబ్యాసం తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగిగా ఎన్టీఆర్ జీవితం ప్రారంభించే సన్నివేశాలని ఈ చిత్రంలో చూపించారు.

    సెకండ్ హాఫ్‌లో బలంగా

    సెకండ్ హాఫ్‌లో బలంగా

    తొలి అర్ధభాగాన్ని దర్శకుడు క్రిష్ యావరేజ్ గా నడిపించినట్లు తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో సన్నివేయాలకు బలమైన ఎమోషన్ జోడించి ప్రేక్షకులని మెప్పించాడు. కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ సంగీత చిత్రాన్ని మరో స్థాయికి చేర్చింది. బాలయ్య అద్భుతమైన నటన కనబరిచాడు. ఎన్టీఆర్ పోషించిన పౌరాణిక పాత్రలు శ్రీకృష్ణుడు, రావణ బ్రహ్మ వేషధారణలో బాలయ్య తన నటనతో మెప్పించాడు. సావిత్రితో వచ్చే సన్నివేశాలు, పాతాళ భైరవిలో తోటరాముడి పాత్రలో వచ్చే సీన్స్ అభిమానులని మెప్పించే విధంగా ఉన్నాయి.

    ఆ రెండు సీన్స్ అదుర్స్

    ఆ రెండు సీన్స్ అదుర్స్

    ఎన్టీఆర్ కథానాయకుడులో బాలయ్య రెండు సన్నివేశాల్లో దుమ్ము దులిపేసినట్లు తెలుస్తోంది. దివిసీమ ఉప్పెన నేపథ్యంలో సాగే సీన్, సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించే సీన్ అదుర్స్ అట. ఎన్టీఆర్ సతీమణి బసవతారకంగా విద్యాబాలన్ తో వచ్చే సీన్స్ కూడా మెప్పిస్తాయట. మొత్తంగా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం సంక్రాంతికి విడుదలైన తొలి చిత్రంగా అంచనాలని అందుకున్నట్లు తెలుస్తోంది.

    English summary
    NTR Kathanayakudu premier show talk : Two scenes are major highlight in the movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X