twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్‌తో క్రిష్‌ ఊహించని దెబ్బ.. ఎన్ని కోట్ల నష్టమంటే..

    |

    డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడికి టైమ్ బాగాలేనట్టు కనిపిస్తున్నది. ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మణికర్ణిక, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు పేరు తీసుకురాకపోగా, వివాదాల్లోకి నెట్టాయి. దర్శకత్వం టైటిల్‌పై బాలీవుడ్‌లో వివాదం చెలరేగుతుంటే.. టాలీవుడ్‌లో ఎన్టీఆర్: కథానాయకుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం క్రిష్‌ కెరీర్‌లో మచ్చగా మారింది. అయితే ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ కథానాయకుడు క్రిష్‌కు భారీ నష్టాలను తెచ్చిపెట్టినట్టు సినీ ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

    బాక్సాఫీస్ వద్ద నిరాశ

    బాక్సాఫీస్ వద్ద నిరాశ

    ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతల నుంచి డైరెక్టర్ తేజ తప్పుకోవడంతో క్రిష్‌కు అవకాశం దక్కింది. సినిమాపరంగా క్రిష్ టేకింగ్, మేకింగ్ చాలా హై క్వాలిటీతో రూపొందిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించలేకపోవడంతో సినిమా ఆర్థికంగా బాగా చితికిపోయింది. ఈ సినిమా క్రిష్‌ను ఆర్థికంగా కూడా కుంగదీసిందట.

    ఎన్టీఆర్ కథానాయకుడు క్లోజింగ్ కలెక్షన్స్.. అజ్ఞాతవాసి, స్పైడర్ తర్వాత ఇదే!ఎన్టీఆర్ కథానాయకుడు క్లోజింగ్ కలెక్షన్స్.. అజ్ఞాతవాసి, స్పైడర్ తర్వాత ఇదే!

     క్రిష్ గుంటూరు డిస్ట్రిబ్యూషన్

    క్రిష్ గుంటూరు డిస్ట్రిబ్యూషన్

    ఎన్టీఆర్ బయోపిక్‌కు దర్శకత్వ బాధ్యతలు చేపట్టడంతో సినిమాను గుంటూరులో సొంతంగా రిలీజ్ చేశాడు. గుంటూరు జిల్లా హక్కుల కోసం రూ.6 కోట్లు చెల్లించినట్టు ట్రేడ్ వర్గాల రిపోర్టు. అయితే గుంటూరు థియేట్రికల్ హక్కులను మరో వ్యక్తికి రూ.3 కోట్లకు అమ్మడం జరిగింది. అయితే ఈ సినిమా జిల్లాలో మొత్తంగా రూ.3 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

    గుంటూరు జిల్లాలో భారీగా నష్టం

    గుంటూరు జిల్లాలో భారీగా నష్టం

    గుంటూరు జిల్లాలో క్రిష్ పంపిణీ చేయడం ద్వారా రూ.1.5 కోట్లు నష్టం వాటిల్లినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే అటు అనుకున్న ఫలితం రాకపోవడం, ఇటు ఆర్థికంగా నష్టం రావడం క్రిష్‌ను ఇబ్బందికి గురిచేసే అంశమేనని చెప్పవచ్చు. ప్రస్తుతం క్రిష్ ఆశలన్నీ ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోయే ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంపై ఉన్నాయి.

    మణికర్ణిక తలనొప్పితో

    మణికర్ణిక తలనొప్పితో

    ఇక ఇదే సమయంలో రిలీజైన మణికర్ణిక చిత్రం దర్శకుడు క్రిష్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. దర్శకత్వం క్రెడిట్‌పై కంగన రనౌత్, క్రిష్ మధ్యన భారీగా మాటల యుద్ధం జరిగింది. క్రిష్ చేసిన ఆరోపణలకు నిర్మాత కమల్ జైన్, దర్శకురాలు, నటి కంగన రనౌత్ ఘాటుగా జవాబివ్వడం కొంత ప్రతికూలంగా మారాయి.

    English summary
    NTR Kathanayakudu hit the screens for Sankranthi. Despite high expectations, the movie failed to impress the audience. Krish has bought the theatrical rights of the movie in the Guntur region for Rs. 6 crores. The movie made only 3 crores in its final run in that region. So, Krish had big loss on this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X