100 విగ్రహాలు.. ప్రత్యేక పూజలు... బాలయ్య సంచలన నిర్ణయం

Recommended Video

NTR's 100 Busts In Theatres Across Telugu States To Mark NTR Kathanayakudu Release

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్ర ప్రమోషన్‌ను భారీగా చేపడుతున్నారు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి పలు రకాల వ్యూహాలను రచిస్తున్నారు. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో సినిమాను ప్రదర్శించే థియేటర్ల వద్ద ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించాలని ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ, విద్యాబాలన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ జనవరి 9న విడుదల కానున్నది. వివరాల్లోకి వెళితే...

తెలుగు రాష్ట్రాల్లో 100 థియేటర్లలో

తెలుగు రాష్ట్రాల్లో 100 థియేటర్లలో

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కథానాయకుడు ప్రదర్శించే థియేటర్ల వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాదాపు 100 థియేటర్లలో వీటిని ఏర్పాటు చేస్తారు. తొలి విగ్రహాన్ని తిరుపతిలోని పీజేఆర్ థియేటర్లలో ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, విద్యాబాలన్ పాల్గొంటారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా

ఐదు దశాబ్దాలపాటు వెండితెర రారాజుగా వెలిగిన ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీని పెట్టి తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్నో సంక్షేమ పథకాలను పేదలకు అందుబాటులోకి తెచ్చారు. వ్యక్తిగత, రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు గురయ్యారు. అలాంటి మహనీయుడు జీవిత కథను బాలకృష్ణ అద్భుతంగా తెరకెక్కించినట్టు వార్తలు వస్తున్నాయి.

జనవరి 9న, ఫిబ్రవరి 7న

జనవరి 9న, ఫిబ్రవరి 7న

ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు విభాగాలు విభజించి ఎన్టీఆర్ కథానాయకుడిగా తొలిపార్టును జనవరి 9న, ఎన్టీఆర్ మహానాయకుడు పేరుతో రెండోపార్టును ఫిబ్రవరి 7న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచాయి.

తిరుపతిలో బాలకృష్ణ

తిరుపతిలో బాలకృష్ణ

ఎన్టీఆర్ బయోపిక్‌ చిత్ర ప్రమోషన్ కోసం క్రిష్, విద్యాబాలన్, బాలకృష్ణ విజయవాడ, బెంగళూరు ప్రాంతాల్లో సోమవారం పర్యటించనున్నారు. మంగళవారం తిరుపతిలో బాలకృష్ణ, చిత్ర యూనిట్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం తిరుపతిలోని పీజేఆర్ థియేటర్‌ను సందర్శించి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ఎన్‌బీకే ఫిల్మ్స్, వరాహి చలన చిత్రం, విబ్రి మీడియా బ్యానర్స్‌పై బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇంటూరి నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సతీమణిగా విద్యాబాలన్ నటిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి కు కంచె, గౌతమి పుత్రశాతకర్ణి సినిమాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం, ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X