twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ శాటిలైట్ రైట్స్‌కు ఊహించని రేటు, ఎంతంటే?

    |

    మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా ఈ బయోపిక్ రూపొందుతుండగా మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ఇందులో ఎన్టీఆర్ బాల్యం, సినీ రంగం వైపు ఎలా వచ్చారు, మామూలు నటుడి స్థాయి నుంచి విశ్వవిఖ్యాత నటుడిగా ఎలా ఎదిగారు అనేది చూపించబోతున్నారు. సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉండటంతో శాటిలైట్ రైట్స్‌కు సైతం మంచి డిమాండ్ ఏర్పడింది.

    NTR-Kathanayakudus satellite rights

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'ఎన్టీఆర్-కథానాయకుడు' శాటిలైట్ రైట్స్ ఓ ప్రముఖ తెలుగు ఎంటర్టెన్మెంట్ ఛానల్ రూ. 25 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ వేర్వేరుగా అమ్మకానికి పెట్టారు. ఇలా వచ్చే ఆదాయంతో సినిమా విడుదల ముందే ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం రాబడుతున్నట్లు తెలుస్తోంది.

    జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్‌ రెండో భాగం 'ఎన్‌.టి.ఆర్‌ మహానాయకుడు' ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద తారాగణంగా తెరకెక్కుతున్న సినిమా మాత్రమే కాదు... ఇండస్ట్రీకి చెందిన ఎక్కువ మంది పాత్రలు ఈ చిత్రంలో కనిపించబోతుండటం ఇదే తొలిసారి. ఎన్‌బికె ఫిల్మ్స్ నిర్మాణంలో వారాహి చలన చిత్రం సమర్పణలో బయోపిక్ విడుదల కాబోతోంది. ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం అందించారు.

    English summary
    According to an English daily, the satellite rights of the NTR biopic has been sold to a top television channel for a whopping Rs 25 crore. It is a known fact that the biopic is being released in two parts - NTR-Kathanayakudu and NTR-Mahanayakudu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X