For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఎన్టీఆర్ తో చిత్రం గురించి కొరటాల శివ ట్వీట్

  By Srikanya
  |
  హైదరాబాద్: ఎన్టీఆర్ ,కొరటాల శివ కాంబినేషన్ లో చిత్రం రానున్నదంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ లో ఈ చిత్రం ప్రారంభమవుతుందని మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. అయితే అటువంటిదేమీ ప్రస్తుతం లేదని కొరటాల శివ కొట్టిపారేస్తూ ట్వీట్ చేసారు.

  కొరటాల శివ ట్వీట్ లో... మేమిద్దరం మా ప్రాజెక్టు లలో బిజీగా ఉన్నాం. ఎన్టీఆర్ ఇప్పటికే కందిరీగ దర్శకుడు సినిమా చేస్తున్నారు. మే నెల దాకా ఆ చిత్రం షెడ్యూల్ ఉంది. మరో ప్రక్క కొరటాల శివ..మహేష్ బాబుతో యు టీవి బ్యానర్ లోచేసే చిత్రం జూన్ లేదా జూలై లో ప్రారంభమవుతుంది. కాబట్టి మేమిద్దరం తర్వాత కలిసి పనిచేస్తాం అంటూ ట్వీట్ చేసారు.


  ఇక ఏ సినిమాకైనా కథ ముఖ్యం. దానినుంచే పాత్రలు పుడతాయి. నా మిర్చి సినిమాకి చక్కని టీమ్‌ కుదిరింది. అందువల్ల ఔట్‌పుట్‌ బాగా వచ్చింది. మణిరత్నం సినిమాలో గొప్ప కథని చెబుతారు. రాజ్‌కుమార్‌ సంతోషి సినిమాలన్నా ఇష్టం. వీరిద్దరూ ఎమోషన్‌, సంఘర్షణ బాగా చూపిస్తారు. నాకు వీళ్లే ప్రేరణ అన్నారు కొరటాల శివ.

  ఇక కథే సినిమాని నడిపించేది. మాటల్ని పుట్టించేది. అలాగే కథ, స్క్రిప్టు రాసుకోవడం తెలిస్తే దర్శకత్వం వహించడం కష్టమేమీ కాదు. కెమెరా షాట్‌లు తెలియాల్సిన అవసరం లేదు. రాయడం వస్తే..టెక్నికల్‌ విషయాలు సెట్స్‌కెళ్లి చూసి నేర్చేసుకోవచ్చు. ఇప్పటివరకూ నా కథల్ని దర్శకులు బాగానే చూపించారు. అవసరమైతే ఆ సెట్స్‌లో కూడా తమ వ్యూస్‌ని దర్శకులు నాతో పంచుకునేవారు. అయితే నా కథల్ని నేనైతే..వారికంటే బెటర్‌గా చూపించగలను అనిపించింది. ఎమోషన్‌ని వారికంటే గట్టిగా చెప్పగలను అనే కాన్ఫిడెన్స్‌తోనే దర్శకుడినవ్వాలని అనిపించింది అని చెప్పుకొచ్చారు.

  అలాగే చిన్నప్పట్నుంచి పుస్తకపఠనం, రచనలు చేయడంపై ప్యాషన్‌ ఉంది. పోసాని కృష్ణమురళి నా బంధువు. దాంతో బిటెక్‌ పూర్తయ్యాక అతడి వద్ద శిష్యరికం చేశాను. రవితేజ 'భద్ర'కి తొలిసారి మాటలు రాశాను. 'బృందావనం' చిత్రానికి కథ కూడా నేనే రాశాను. మళ్లీ ఓ పెద్ద కథని రాస్తా. దాంట్లో పెద్ద హీరో నటిస్తాడా? ఇంకెవరైనా చేస్తారా? అనేది తర్వాత ఆలోచిస్తా. కథకే నా మొదటి ప్రాధాన్యం అన్నారు.

  English summary
  
 Koratala Siva tweeted that the reason for this is that both of them are busy with their respective projects. NTR is already working for a film (in the direction of Kandireega Santosh Srinivas) that will be complete only in May. On the other hand, Koratala Siva has already signed a film with Mahesh Babu for UTV banner that will go to the sets from June/July. So both of us decided to work later, the director tweeted.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more