జులై1 నుంచి ఎన్టీఆర్-కృష్ణవంశీ సినిమా
ఎన్టీఆర్‌తో శ్రీ దుర్గా ఆర్ట్స్ సంస్ధ నిర్మించనున్న సినిమా జూన్ 15న లాంఛనంగా ప్రారంభమై జులై 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇలియానా, చార్మి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు రాఖి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. కెఎల్ నారాయణ, ఎస్ గోపాలరెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇలా ఉండగా ఎన్టీఆర్ అశోక్ ఆడియో విడుదల వేదిక మారింది. ఈ సినిమా ఈనెల 8న (రేపు) విడుదల కానుంది. మొదట మాదాపూర్‌లోని శిల్ప కళావేదికలో ఆడియోను విడుదల చేయాలనుకున్నారు. కానీ మరింత వైభవోపేతంగా ఉండేందుకు యూసుఫ్‌గుడాలోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications