»   »  ఫొటోలు:అభయ్ రామ్ తో అడుకుంటున్న ఎన్టీఆర్-లక్ష్మి ప్రణతి

ఫొటోలు:అభయ్ రామ్ తో అడుకుంటున్న ఎన్టీఆర్-లక్ష్మి ప్రణతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతిల ముద్దల బిడ్డ అభయ్ రామ్ నిన్నటి రోజున అందరిముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో మొదలైన చిత్రం ప్రారంభోత్సవానికి తన భార్య, కుమారుడుతో ఎన్టీఆర్ వచ్చారు. దాంతో నందమూరి అభిమానులకు పండుగే అయ్యింది. ఆ క్షణాలలో తల్లి,తండ్రులతో ఆ బుడతడు ముద్దులు ఒలుకుతూ ఆడుకున్న ఫొటోలు క్రింద స్లైడ్ షో లో చూడండి.

నిజానికి 'నాన్నకు ప్రేమతో' షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్‌. ఈలోగా మరో సినిమానీ పట్టాలెక్కించేశారు. ఎన్టీఆర్‌ హీరోగా మైత్రీ మూవీస్‌ సంస్థ ఓ చిత్రానికి శ్రీకారం చుట్టింది. కొరటాల శివ దర్శకుడు. నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ నిర్మాతలు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. దేవుడి పటాలపై తెరకెక్కించిన తొలి సన్నివేశానికి ఎన్టీఆర్‌ క్లాప్‌నిచ్చారు. ఎన్టీఆర్‌ తనయుడు అభయ్‌రామ్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అభిరామ్ స్విచ్చాన్ చేయటంతో అందరి దృష్టీ ఆ బుడతడుమీదే పడింది. అందరూ ఎంత క్యూట్ గా ఉన్నాడు అని మెచ్చుకున్నారు. ఆ ప్రారంభోత్సవానకి వచ్చిన కొందరు అభిరామ్ ని ముద్దాడారు. ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ''బృందావనం' దగ్గర్నుంచీ కొరటాల శివతో అనుబంధం ఉంది. అభిరుచి గల దర్శకుడాయన. మంచి రచయిత కూడా. మాస్‌ మెచ్చేలా, క్లాస్‌కి నచ్చేలా సినిమాలు తీస్తుంటారు. ఈ సినిమా కూడా అందరి మన్ననలూ పొందుతుందన్న నమ్మకం ఉంది''అన్నారు.

స్లైడ్ షోలో...ఫొటోలు

అభయ్ రామ్

అభయ్ రామ్

ఈ మూవి ఓపినింగ్స్ లో అభిరామ్ స్వెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

మధురానుభూతి

మధురానుభూతి

అభిరామ్ కెమెరా స్విచ్చాన్ చేయటం నిజంగా ఓ మధురానుభూతే.

ఎన్టీఆర్

ఎన్టీఆర్

ఎన్టీఆర్ ఈ పంక్షన్ కు నాన్నకు ప్రేమతో లుక్ లో కనపడ్డాడు. అభయ్ తో చాలా ఉత్సాహంగా ఈవెంట్ లో పాల్గొన్నాడు.

రేర్ గా

రేర్ గా


భార్య లక్ష్ణి ప్రణతి చాలా రేర్ గా ఎన్టీఆర్ పంక్షన్స్ కు వస్తూంటుంది.

టీడీపి లీడర్

టీడీపి లీడర్

టీడీపి లీడర్ ఎర్రంబెల్లి ..ఈ ఈవెంట్ లో అభయ్ తో ఆడుకుంటూ కనిపించారు.

అందరి దృష్టీ

అందరి దృష్టీ

ఈవెంట్ కు విచ్చేసిన అందరి దృష్టీ అభిరామ్ పైనే ఉంది.

English summary
NTR fans got to witness some adorable moments at the opening ceremony yesterday, as NTR attended the event along with his wife Lakshmi Pranathi and Son Abhay Ram. Check out some of the unseen and cute pictures of NTR and his wife playing with their son, in the slides below.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu