జూ ఎన్టీఆర్ 'బృందావనం' లో ఏం జరుగుతోంది
'మున్నా' ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న 'బృందావనం' చిత్రం పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా రూపొందుతోందని సమాచారం. రెగ్యులర్ ఎన్టీఆర్ కనిపించే స్టైల్ కి పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉండబోతోందని చెప్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన గత చిత్రాలు బొమ్మరిల్లు,ఆర్య తరహాలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటూనే ఎన్టీఆర్ అభిమానులకు నచ్చే కొన్ని ఎమోషన్స్ ని కలుపుకుంటూ సాగుతుందని చెప్తున్నారు. ఇక 'గోవిందుడు అందరి వాడేలే' అనే ఉపశీర్షికతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ ఇద్దరి కలయికలో తొలి చిత్రం ఇది. ఇటివలే పొల్లాచ్చి, హైదరాబాద్‌ల్లో షెడ్యూల్స్‌ని ఈ చిత్రం పూర్తిచేసుకుంది.అలాగే ఈ వేసవికి చిత్రాన్ని విడుదల చేయ డానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: తమన్, ఎడిటింగ్: మార్తాండ్. కె.వెంకటేష్, ఫైట్స్: పీటర్ హెయిన్స్.


Click it and Unblock the Notifications











