రామ్ సినిమాకి జూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్
రామ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న రామ రామ కృష్ణ కృష్ణ చిత్రానికి జూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పారు. ఈ చిత్రం ప్రారంభంలో ఇది వస్తుంది. లక్ష్యం వాసు నిర్మిస్తున్న రామ రామ కృష్ణ కృష్ణ ఈ వారమే రిలీజ్ అవుతోంది. రామ్ సరసన ప్రియా ఆనంద్, బిందు మాధవి చేస్తున్న ఈ చిత్రంలో అర్జున్ ఓ కీలకమైన పాత్రను చేస్తున్నారు. అలాగే దిల్ రాజు నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా బృందావనం చిత్రం రూపొందుతోంది. కాజల్, సమంత హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని మున్నా ఫేమ్ వంశీ పైడిపల్లి డైరక్ట్ చేస్తున్నారు. ఇక ఇంతకుముందు జల్సా చిత్రానికి మహేష్ బాబు, వరుడు చిత్రానికి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు.
రామ్ రామ రామ కృష్ణ కృష్ణ జూ ఎన్టీఆర్ దిల్ రాజు ప్రియా ఆనంద్ బిందు మాధవి ram rama rama krishna krishna jr ntr dil raju priya anand bindu madhavi


Click it and Unblock the Notifications