Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ట్విట్టర్ రివ్యూ: ఎన్టీఆర్ మహానాయకుడు.. బాలయ్య, రానా పోటీపడి నటించారా!
స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు శుక్రవారం విడుదల అవుతోంది. ఇటీవల ట్రైలర్ కూడా విడుదుల చేశారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. పార్టీ స్థాపించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం, దేశ రాజకీయాలని సైతం మలుపు తిప్పేలా అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం లాంటి విశేషాలు ఎన్టీఆర్ మహానాయకుడులో ఉండబోతున్నాయి. ఈ చిత్ర విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూద్దాం!
|
అసెంబ్లీ సీన్ కేక
ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం ద్వారా దర్శకుడు క్రిష్ బలమైన పొలిటికల్ కథని చెప్పారు. సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంది. బాలయ్య ఎప్పటిలాగే తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. కానీ విద్యాబాలన్ పోషించిన బసవతారకం పాత్ర ఈ చిత్రానికి ప్రాణం అని చెప్పాలి. అసెంబ్లీ సన్నివేశాలు చాలా బావున్నాయి.
|
ఆయన్ని హీరోలా
ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో రానా పోషించిన చంద్రబాబు పాత్రని హీరోలా చూపించారు. కమర్షియల్ అంశాలు లేకపోవడం ఈ చిత్రానికి పెద్ద మైనస్. లక్ష్మీస్ ఎన్టీఆర్ తప్పు అని చెప్పేలా ఈ చిత్రం ఉంది. బాక్సాఫీస్ వద్ద ఏమేరకు నిలబడగలుగుతుందో చూడాలి.
|
ఎమోషనల్ సీన్స్ మాత్రమే
ఎన్టీఆర్ గా బాలయ్య నటన, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మినహా సినిమాలో ఇంకేమీ లేదు. సినిమా ఎక్కడా ఎంగేజింగ్ గా అనిపించలేదు.
|
అవకాశం చేజారింది
ఎన్టీఆర్ బయోపిక్ ని ఒకే సినిమాగా తీసి ఉంటే బావుండేది. క్రిష్ మంచి అవకాశాన్ని వదులుకున్నారు.
|
కథానాయకుడు కంటే
ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం కథానాయకుడు కంటే బావుంది. కానీ ఇది సరిపోదు.
|
చారిత్రాత్మకం
ఇప్పుడే ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం చూశా. ఈ సినిమా చారిత్రాత్మకం. చిత్ర యూనిట్ కి అభినందనలు.
|
సినిమా మొత్తం
ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా పరమ రొటీన్ గా ఉంది. కథానాయకుడులో ఫస్ట్ హాఫ్ బావుంది. కానీ మహానాయకుడులో సినిమా మొత్తం భజనే. ఈ చిత్రం ప్రజలని తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
|
క్లైమాక్స్ బావుంది
ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో సెంటిమెంట్, ఎమోషనల్ సన్నివేశాలతో 1983, 84లో జరిగిన రాజకీయాలని చూపించారు. బాలయ్య, విద్యాబాలన్ కథని నడిపించారు. క్లైమాక్స్ సన్నివేశం హృదయాన్ని హత్తుకునే విధంగా ఉంది.
|
ఇందిరాగాంధీ సన్నివేశాలు
కొన్ని సన్నివేశాల్లో చంద్రబాబు పాత్రని బాగా హైలైట్ చేశారు. ఆ స్థాయిలో ఎన్టీఆర్ పాత్రని హైలైట్ చేయలేదు. ఇందిరాగాంధీ సన్నివేశాలు హాస్యాస్పదంగా ఉన్నాయి.
|
ఎన్టీఆర్ జీవితాన్ని చూపించకుండా
చంద్రబాబు, లోకేష్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ఉపయోగించుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ జీవితాన్ని చూపించలేదు. ఎన్టీఆర్ మహాయకుడు చిత్రం ద్వారా సమయం వృధా.