'ఎన్టీఆర్ మహానాయకుడు' దర్శనం రేపే.. ఎక్కడ చూసిన రానానే!
స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ ఎన్టీఆర్ బయోపిక్. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలై నిరాశపరిచింది. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలకు సిద్ధం అవుతోంది. మొదటి భాగంలో ఎన్టీఆర్ సినీరంగ విశేషాలని చూపించిన దర్శకుడు రెండవ భాగంలో రాజకీయ ప్రస్థానాన్ని చూపించబోతున్నాడు. ఎన్టీఆర్ రాజకీయా జీవితంలో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం ఫిబ్రవరి 22న విడుదల కాబోతుండగా చిత్ర యూనిట్ అభిమానుల కోసం ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది.

విడుదల తేదీ ఖరారు
ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి ముందుగా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. ఆ తరువాత ఫిబ్రవరి 7కు వాయిదా పడింది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం నిరాశపరచడం, పైగా ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి సంబందించిన ఇంకా కొంచెం వర్క్ మిగిలిపోయి ఉండడంతో ఆ తేదీన కూడా చిత్రం విడుదల కాలేదు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన చిత్ర యూనిట్ ఎన్టీఆర్ మహానాయకుడుని ఫిబ్రవరి 22న విడుదల చేయబోతోంది.

ఎక్కడ చూసిన రానానే
ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో అభిమానులని అత్యంత ఉత్కంఠకు గురిచేస్తున్న అంశం రానా పాత్ర. దగ్గుబాటి రానా ఈ చిత్రంలో నారా చంద్రబాబు నాయుడు పాత్రని పోషిస్తున్నాడు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన సమయంలో చంద్రబాబు యాక్టివ్ రోల్ ప్లే చేశారు. చంద్రబాబు పాత్రలో రానా ఎలా నటించాడు, ఆయన పాత్రని దర్శకుడు క్రిష్ ఎలా డిజైన్ చేసాడు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్స్ లో కూడా బాలయ్య పక్కనే రానా కనిపిస్తున్నాడు.

నష్టపరిహారం సెటిల్ చేశాడు
బాలయ్య స్వయంగా ఎన్టీఆర్ కథానాయకుడు డిస్ట్రిబ్యూటర్స్ తో చర్చలు జరిపిన తర్వాత నష్టపరిహారం విషయంలో నెలకొన్న వివాదం తొలగింది. ఎన్టీఆర్ మహానాయకుడు ద్వారా వచ్చే మొత్తంలో మొదట బయ్యర్లు 33 శాతం నష్టపరిహారంగా తీసుకోనున్నారు. ఆ తర్వాత నిర్మాతకు 60 శాతం షేర్ వెళ్లనుంది. ఈ ప్రతిపాదనతో బయ్యర్లు సంతృప్తి చెందడంతో ఎన్టీఆర్ మహానాయకుడుని విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు.

ట్రైలర్ రేపే
ఎన్టీఆర్ మహానాయకుడు చిత్ర ట్రైలర్ విడుదలకు ముహూర్తం కుదిరింది. ఫిబ్రవరి 16 సాయంత్రం 5:55కి ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ మహానాయకుడు మొత్తం ఎన్టీఆర్ టిడిపిని ఎలా స్థాపించారు, ఎన్నికల్లో ఎలా విజయం సాధించారు అనే విశేషాలు ఉండనున్నాయి. కథానాయకుడు చిత్రం విజయం సాధించకపోవడంతో ఈ చిత్రంపై ఆ ప్రభావం ఉంది. ఎలాంటి సవాళ్ళని అధికమించి ఎన్టీఆర్ మహానాయకుడు ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











