ఆడవారి వయసు, బాహుబలి రెమ్యునరేషన్.. ప్రభాస్, కీరవాణితో ఎన్టీఆర్ రచ్చ రచ్చ!
దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోది. తన కొడుకు పెళ్లిని రాజమౌళి జైపూర్ లోని ఓ ప్రయివేట్ రిసార్ట్ లో జరిపిస్తున్నారు. కార్తికేయ, పూజ వివాహానికి చాలామంది టాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. డిసెంబర్ 29 అంటే నేడు కార్తికేయ, పూజా వివాహబంధంతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకకు రాజమౌళి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్, రానా, నాని లాంటి స్టార్ హీరోలంతా హాజరు కావడం విశేషం. పెళ్లి వేడుక వద్ద తారలు చేస్తున్న సందడి కోలాహలంగా మారింది.

బాహుబలి రెమ్యునరేషన్
పెళ్లి వేడుకలో సెలెబ్రిటీల మధ్య సరదా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభాస్, కీరవాణి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కీరవాణి ప్రభాస్ తో మాట్లాడుతూ.. ఆడవారి వయసు, బాహుబలి రెమ్యునరేషన్ చెప్పకూడదు అని అన్నారు.. దానికి ప్రభాస్ అవును సర్ అంటూ బదులిచ్చాడు. ఈ లోపు ఎన్టీఆర్ వచ్చి రచ్చ రచ్చ చేశాడు.
బృందావనం గురించి
ప్రభాస్, కీరవాణి మధ్య సంభాషణ జరుగుతుండగా ఎన్టీఆర్ పరుగున వచ్చి.. మీరు బృందావనంలో చేశారు కదా అంటూ వాదనకు దిగాడు. నేను బృందావనం చేయలేదు.. ఒక పాట పాడాను అని కీరవాణి ఎన్టీఆర్ కు బదులిచ్చాడు. ఎన్టీఆర్ అవేమి పట్టించుకోకుండా మనం గెలిచాం బ్రదర్ అంటూ ప్రభాస్ కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. తిరిగి మళ్ళి ప్రభాస్, కీరవాణి మధ్య మాటలు కొనసాగాయి.
మొత్తానికి ఇచ్చారు కదా సర్
మీనాన్న గారు నాకు రెమ్యునరేషన్ ఇస్తానని మాట ఇచ్చారు. నా మొదటి చిత్రం కల్కి ఆగిపోయింది. అప్పట్లో ఇంత రెమ్యునరేషన్ ఉండేది కాదు. కానీ మీ నాన్న నాకు కొంత మొత్తం ఇస్తానని ప్రామిస్ ప్రామిస్ చేసినట్లు కీరవాణి చెబుతుండగా.. మొత్తానికి ఇచ్చారుకదా సర్ అంటూ సెటైర్ పేల్చాడు. ప్రభాస్ సెటైర్ కు అక్కడున్నవారంతా నవ్వుల్లో మునిగి తేలారు. సందడి మొత్తం జరుగుతుండగా పక్కనే రాజమౌళి కూడా ఉన్నాడు.

300మంది అతిథులు
రాజమౌళి బంధు మిత్రులు, సెలెబ్రిటీలు అంతా కలసి ఈ వివాహానికి 300 మందికి పైగా హాజరవుతున్నట్లు తెలుస్తోంది. అతిథుల కోసం రాజమౌళి అన్ని ప్రాంతాలకు సంబంధించిన వంటకాలు సిద్ధం చేయించారట. కార్తికేయ, పూజ వివాహ వేడుక మూడురోజుల పాటు జరగనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











