ఎన్టీఆర్ స్టామినా ఎంతో తేలుతుంది: రభస గ్రాండ్ రిలీజ్

By Bojja Kumar

హైదరాబాద్: అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'రభస' మూవీ విడుదలకు గ్రాండ్‌గా రంగం సిద్ధమయింది. ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. మూవీ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగా జరిగి పోయింది. డిమాండ్‌కు తగిన విధంగానే ఈచిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 1200 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. గణేష్ చతుర్తి హాలిడే కావడం కలిసొస్తుందని భావిస్తున్నారు.

Rabhasa

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రభస చిత్రం సీడెడ్ ఏరియాలో 150 థియేటర్లలో, సిటీలో 95 స్క్రీన్లతో కలిపి హైదరాబాద్ ఏరియాలో 285 థియేటర్లు, వైజాగ్, కృష్ణా, గుంటూరు ఒక్కో ఏరియాలో 75 థియేటర్ల చొప్పున, వెస్ట్ గోదావరిలో 55 థియేటర్లలో, ఈస్ట్ గోదావరిలో 60 థియేటర్లు, నెల్లూరులో 35 థియేటర్లలో విడుదలవుతోంది.

మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో 435 థియేటర్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 375 థియేటర్లలో సినిమా విడుదలవుతోంది. దీంతో పాటు కర్నాటకలో 85 సినిమా హాల్స్, తమిళనాడులో 55 థియేటర్లు, ముంబై, పూణెతో కలిపి ఇతర నార్త్ ఇండియా రాష్ట్రాల్లో 90 థియేటర్లు, యూఎస్ఏలో 95 స్క్రీన్లు, యూకె, యుఏఈ, ఆస్ట్రేలియా లాంటి ఫారిన్ కంట్రీల్లో కలిపి 55 థియేటర్లు కేటాయించారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 1200 థియేటర్లలో 'రభస' చిత్రం గ్రాండ్‌గా విడుదలవుతోంది.

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయసుధ, నాజర్, అలీ, షాయాజీ షిండే, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. థమన్ సంగీతం, శ్యామ్ కె.నాయుడు సినిమాకు హైలెట్ కానున్నాయి. ఇటీవల విడుదలైన ప్రోమోతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. మరి ఎన్టీఆర్ స్టామినా ఎలా ఉంటుంది? ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ డే కలెక్షన్లతో తేలి పోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X