ఎన్టీఆర్ షూటింగ్ కి బాబు ప్లానింగ్

దాని నిమిత్రం ఎన్టీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. సోమవారం రాత్రి బాబు నివాసానికి వచ్చిన ఎన్టీఆర్... తాజా రాజకీయ పరిస్థితులపై పదినిమిషాల పాటు చర్చించినట్లు తెలిసింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్నికలు ముందుగా జరుగుతాయా లేక ఏప్రిల్‌లోనే జరగవచ్చా అన్న విషయాన్ని ఎన్టీఆర్ తెలుసుకోగోరారని సమాచారం.దానినిబట్టి తన షూటింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేసుకోవాలని, ఎన్నికల సమయానికి తీరిక ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఎన్నికలు ఏప్రిల్‌లోనే జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. కాగా, బాలకృష్ణ విదేశాల నుంచి వచ్చిన తర్వాత మరోసారి అంతా కలిసి కూర్చోవాలని ఉభయులూ నిర్ణయించారు.
movies telugu chandrababu jr ntr tdp vv vinayak balakrishna వివి వినాయిక్ ఎన్టీఆర్ చంద్రబాబు టీడీపీ


Click it and Unblock the Notifications