ఎన్టీఆర్,మెహర్ రమేష్ చిత్రం టైటిల్
ఎన్టీఆర్,మొహర్ రమేష్ కాంబినేషన్లో అశ్వనీదత్ రూపొందించనున్న చిత్రానికి శక్తి అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ తో కంత్రి చిత్రాన్ని రూపొందించిన మెహర్ అనంతరం ప్రభాస్ తో భిళ్ళా ని డైరక్ట్ చేసారు.అలాగే 'కంత్రి' చిత్రాన్ని అందించిన వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ మరోసారి ఈ చిత్రానికి భారీ బడ్జెట్ తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోవటంతో మార్కెట్లో మంచి అంచనాలే ఏర్పడుతున్నాయి.ఇక డిసెంబర్ 10 నుంచి వారణాసిలో షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అశ్వనీదత్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'ఇంద్ర' షూటింగ్ కూడా అప్పట్లో వారణాసిలోనే మొదలైంది. వారణాసితో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలు, విదేశాల్లో కూడా 'శక్తి' చిత్రం షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారు. 'రాఖీ' చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా నటించిన ఇలియానా ఈ కొత్త చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందించబోతున్నారు.అలాగే ఈ చిత్రం ఫారెస్టు బ్యాక్ డ్రాప్ లో నడిచే ఎడ్వెంచర్ అని తెలుస్తోంది. నేషనల్ ట్రెజర్ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం స్క్రిప్టు రెడీ అయినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.


Click it and Unblock the Notifications











