కన్నీరు పెట్టుకుంటూ హరికృష్ణ నివాసానికి ఎన్టీఆర్ తల్లి.. వెంటవచ్చిన ప్రణతి!
హరికృష్ణ ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులని తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. కామినేని ఆసుపత్రి నుంచి హరికృష్ణ పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తరలిస్తున్నారు. హైదరాబాద్ లోని హరికృష్ణ నివాసం వద్దకు అభిమానులు, టిడిపి కార్యకర్తలు చేరుకుంటున్నారు.
ఎన్టీఆర్ తల్లి షాలిని కన్నీరు పెట్టుకుంటూ హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. ఆమె వెంట ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి వచ్చారు. హరికృష్ణ, నందమూరి కుటుంబ సభ్యులు నివాసం వద్దకు చేరుకుంటున్నారు. హరికృష్ణ, షాలిని దంపతుల సంతానమే ఎన్టీఆర్.

హరికృష్ణ పార్థివ దేహాన్ని అంబులెన్స్ లో ఇంటికి తరలిస్తున్నారు. అంబులెన్స్ లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో పాటు బాలయ్య కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హరికృష్ణ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి.
More from Filmibeat
nandamuri harikrishna death nandamuri harikrishna rip nandamuri harikrishna jr ntr news kalyan ram ntr balakrishna chandrababu tollywood janaki ram death నందమూరి హరికృష్ణ డెత్ నందమూరి హరికృ


Click it and Unblock the Notifications











