"కంత్రి" ఆడియో రజనీకాంత్ తో!

రజనీకాంత్ తమిళ సినిమా "కుశేలన్" తెలుగు వెర్షన్ నిర్మిస్తున్న అశ్వనీదత్ "కంత్రి" ఆడియోను విడుదల చేయవలసిందిగా సూపర్ స్టార్ ను కోరినట్టు తెలుస్తోంది. రజనీకాంత్ తన సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీకి వస్తున్నందువల్ల, ఆయన అశ్వనీదత్ వినతిని అంగీకరించారు.
రజనీకాంత్ కు తెలుగు సినిమా రంగం ప్రముఖులందరితో సత్ సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు మోహన్ బాబు ఎంత మంచి మిత్రుడో చిరంజీవీ అంతే. చిరంజీవికీ మోహన్ బాబుకు ఇంకా విభేదాలు ఉన్నప్పటికీ ఇద్దరితోనూ సమానంగా స్నేహం చేయడం రజనీకాంత్ కే చెల్లింది


Click it and Unblock the Notifications











