ఎన్టీఆర్, సురేంద్ర రెడ్డి కాంబినేషన్ కన్ఫర్మ్...
ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో గతంలో అశోక్ చిత్రం వచ్చింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంభందించిన స్క్రిప్టు వర్క్ రీసెంట్ గా పూర్తి చేసి ఎన్టీఆర్ కి వినిపించాడని తెలుస్తోంది. బృందావనం రిలీజ్ కు రెడీ అయింది కాబట్టి ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని సురేంద్రరెడ్డి భావిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా స్క్రిప్టు కి బాగా ఇంప్రెస్ అయి ఆసక్తి చూపుతున్నట్లు చెప్తున్నారు. దాంతో ఈ కాంబినేషన్ కి సంభందించి త్వరలోనే ఎనౌన్స్ మెంట్ రానున్నది. ఈ చిత్రాన్ని బి.వి.యన్. ప్రసాద్ నిర్మించనున్నారు. కిక్ వంటి సూపర్ హిట్టిచ్చిన తర్వాత సురేంద్రరెడ్డి ఏడాది గ్యాప్ తో చేస్తున్న చిత్రం ఇదే. ఇక ఎన్టీఆర్ బృందావనం చిత్రం అక్టోబర్ 14న రిలీజ్ అవనుంది.
జూ ఎన్టీఆర్ సురేంద్ర రెడ్డి అశోక్ అతనొక్కడే పూరీ జగన్నాధ్ jr ntr surender reddy athanokkade athidi puri jagannath kick


Click it and Unblock the Notifications