28 నుంచి ఎన్టీఆర్ సినీ వారోత్సవం
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఈనెల నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా ఆయన క్లాసిక్ చిత్రాలను ప్రదర్శించనున్నారు. మే 26 నుంచి జూన్ 1 వరకు జరిగే ఈ ఉత్సవాలను ఎన్టీఆర్ అభిమానులు నిర్వహిస్తున్నారు. 1923 మే 28న జన్మించిన ఎన్టీరామారావు 1996 జనవరి 18న మరణించారు. ఎన్టీఆర్ నటించిన మరువలేని చిత్రాలు మాయాబజార్, లవకుశ, నర్తనశాల, పాండవవనవాసం, దానవీరశూర కర్ణ తదితర పౌరాణిక చిత్రాలతో పాటు అనేక సాంఘిక, జానపద చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు.


Click it and Unblock the Notifications