బుల్లి ఎన్టీఆర్ కు పేరు పెట్టారు
హైదరాబాద్ : జూ.ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి దంపతులకు జులై 22న మగబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. బుల్లి ఎన్టీఆర్‌కు నందమూరి అభయ్ రామ్ అని పేరు పెట్టారు. అభయ్‌రామ్ నామకరణ మహోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల సమక్షంలో కార్యక్రమం నిర్వహించారు.
ఇక బాబు పుట్టిన సందర్భంగా ...ఎన్టీఆర్‌కు దర్శకుడు రాజమౌళితో పాటు పలువురు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే తనకు కుమారుడు పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులందరికీ ట్విట్టర్ వేదిక ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. 'చాలాకాలం నుంచి ట్విట్టర్‌కు దూరంగా ఉన్నా. కుమారుడు పుట్టిన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా ఈ రోజు మీతో పంచుకుంటున్నా. ఈ సందర్భంగా శుభాకంక్షలు తెలిపిన వారందరికీ నా కృతజ్ఞతలు.' అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

అలాగే " ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి ఇంకొకరు లేరు. ఉండబోరు. ఆయన మళ్లీ పుట్టరు ." అన్నారు జూ.ఎన్టీఆర్ భావోద్వేగంగా. ఆయన్ను మీ ఇంట బాబు పుట్టాడుగా... మళ్లీ మీ తాతగారే పుట్టారనుకుంటున్నారా అంటే వెంటనే ఇలా స్పందించారు. తాతపై తనకున్న అంచంచలమైన అభిమానాన్ని మీడియా సాక్షిగా మరో సారి ఇలా వ్యక్తపరిచారు.


Click it and Unblock the Notifications











