Disha Case Encounter: ఎన్టీఆర్, ఇతర సినీ ప్రముఖుల రియాక్షన్.. ఇదీ న్యాయం అంటే!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా ఘటన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశా కేసులో మొత్తం నలుగురు నిందితులను షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద ఎన్‌కౌంటర్ చేయడం జరిగింది. దీనిపై ఎన్టీఆర్ సహా పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. వివరాల్లోకి పోతే..

సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు

సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు

దిశ హత్య కేసు నిందితులను నేటి (డిసెంబర్ 6) తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య ఎన్‌కౌంటర్‌ చేశారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించడంతో ఆ నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారని సమాచారం అందింది.

Recommended Video

Disha Issue : బ్రేకింగ్ : నిందితుల ఎన్ కౌంటర్... EXCLUSIVE ఎన్ కౌంటర్ వీడియో
 దిశాను చంపేసి తగులబెట్టిన చోటే ఎన్‌కౌంటర్

దిశాను చంపేసి తగులబెట్టిన చోటే ఎన్‌కౌంటర్

దిశాను చంపేసి తగులబెట్టిన చోటే ఆ నలుగురు రేపిస్టులు ఎన్‌కౌంటర్ చేయబడ్డారు. ఈ ఎన్‌కౌంటర్ ఘటనలో పలువురు పోలీసులు సైతం గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ స్పాట్ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్ పై ప్రజలు, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ రియాక్షన్..

అత్యంత దారుణంగా దిశా ఘటనకు పాల్పడిన నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని మొదటి నుంచే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు సినీ ప్రముఖులు. ఈ నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్ విష్యం తెలిసిన ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''ఇప్పుడు న్యాయం జరిగింది. దిశా ఆత్మకు శాంతి కలుగుతుంది'' అని పేర్కొన్నారు.

నాగార్జున స్పందన

''ఈ రోజు ఉదయం లేవగానే దిశా నిందితుల ఎన్‌కౌంటర్ వార్త విన్నాను. ఇప్పుడు దిశా మర్డర్ కేసులో అసలైన న్యాయం జరిగింది'' అని పేర్కొంటూ నాగార్జున ట్వీట్ పెట్టారు.

నాని పవర్‌ఫుల్ రియాక్షన్

దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై నాని పవర్‌ఫుల్ రియాక్షన్ ఇచ్చాడు. ''ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి.. వాడు పోలీసోడు అయ్యుండాలి'' అని పేర్కొంటూ పోలీసుల చర్యను పొగిడాడు.

చాటింపు చేయండి ప్లీజ్.. డైరెక్టర్ ట్వీట్

దిశా నిందితుల ఎన్‌కౌంటర్ పై స్పందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.. ''మా ట్రైలర్, టీజర్ లను లైక్ చేయకపోయినా పర్లేదు.. ప్లీజ్ ఈ ఎన్‌కౌంటర్ వార్తను ట్రెండింగ్ చేయండి. ఇలా జరిగింది అని చాటింపు చేయండి'' అంటూ రియాక్ట్ అయ్యారు.

దిశా ఘటన వివరాలు

దిశా ఘటన వివరాలు

గత నెల 27న దిశపై నలుగురు నిందితులు అత్యాచారం జరిపి.. అనంతరం ఆమెపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. 28న మధ్యాహ్నం నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. 29న షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో నిందితుల విచారణ జరిగింది. 30న నలుగురు నిందితులకు జ్యుడీషియల్‌ కస్టడీకి పోలీసులు తీసుకున్నారు. ఈనెల 4న నిందితులను కోర్టు పోలీస్‌ కస్టడీకి ఇచ్చింది. 5న చర్లపల్లి జైలులో నిందితులను సిట్‌ విచారించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X