ఎన్టీఆర్, నయనతారల జోడీ 'అదుర్స్'
కొన్ని జంటలు సినిమా విడుదలకు ముందే ఎలా వుంటాయా అని ఆసక్తిని రేపుతుంటాయి. ఇటీవల అలా ఆసక్తి రేపి అందరి నోటా నానిన జంట ఎన్టీఆర్, నయనతారలు. అసలు ఎన్టీఆర్ ఏంటీ నయనతారతో జోడిగా ఏంటీ అని అందరూ పెదవివిరిచిన వారే. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల వెయిట్ తగ్గి స్లిమ్ గా తయారయిన ఎన్టీఆర్ అందరి చేత ఆహా అదుర్స్ అనిపించుకున్నాడు. కానీ నయన్ మాత్రం తన దరిద్రపు మేకప్ తో స్లిమ్ అవడానికి ప్రయత్నించి వున్న గ్లామర్ ను పోగొట్టుకొంది. ఇది ఆమె తాజా సినిమా 'ఆంజనేయులు' చూసిన వారెవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. దీంతో ఈ సినిమాలో ఎలా వుంటుందోనని అంతటా ఆసక్తి నెలకొంది.
కానీ ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా సంబంధించిన ఫోటోలు చూసిన వారంతో ముక్తకంఠంతో ఈ జంట అదుర్స్ అంటున్నారు. నయన్ కూడా మునుపటిలా చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రం కానీ హిట్ అయితే వీరి కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వస్తాయని అప్పుడే అంచనాలు మొదలయిపోయాయి.


Click it and Unblock the Notifications











