జూ ఎన్టీఆర్ టైటిల్ 'రచ్చ' వివాదం అప్పుడే ప్రారంభమైంది
మహేష్ ఖలేజాతో ప్రారంభమైన టైటిల్ వివాద సంప్రదాయం ఆ తర్వాత కళ్యాణ్ రామ్ కత్తితో కొనసాగింది. ఈ మధ్యన పవన్ కల్యాణ్ లవ్ లీ అని పెట్టగానే అంతా ఆ టైటిల్ కీ ఏదో వివాదం ఉంటుందని భావించారు. ఇలా ప్రతీ హీరోకీ టైటిల్ వివాదం జరుగుతున్న నేపధ్యంలో ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి సైతం ఈ వివాదం ప్రారంభమైంది. ఈ చిత్రానికి రచ్చ అనే టైటిల్ పెట్టారు. ఆ టైటిల్ నాదేనంటూ సంపత్ నంది అనే దర్శకుడు మీడియా ముందుకు వచ్చారు. సంపత్ నంది ప్రస్తుతం వరుణ్ సందేశ్ హీరోగా ఏమైంది ఈ వేళ అనే చిత్రం రూపొందిస్తున్నారు. అతను ఈ రచ్చ అనే టైటిల్ ని ఓ మాస్ హీరోతో చేయటానికి పెట్టుకున్నానని, దానిని రిజిస్టర్ చేసి రెండుసార్లు రెన్యువల్ చేసానని అంటున్నారు. దీంతో ఈ టైటిల్ వివాదం మళ్ళీ రాజుకోవటం ఇండస్ట్రీలో ఆసక్తికర అంశమైంది. దీనిపై సురేంద్రరెడ్డి, ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు. మరో ప్రక్క ఎన్టీఆర్ అభిమానులు మాత్రం బృందావనం చిత్రంలోని 'పట్నం నుంచి వచ్చాడు లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనురోకండి..క్యాకెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా..లోపల మాస్ అలాగే ఉంది..వాడు బయటకు వచ్చాడో రచ్చ రచ్చే.." అనే డైలాగునుంచి రచ్చ అనే టైటిల్ పుట్టింది కదా..అంటున్నారు.


Click it and Unblock the Notifications











