ఎన్టీఆర్ హీరాగా దిల్ రాజు నిర్మించనున్న చిత్రానికి 'బృందావనం' టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ట్యాగ్ లైన్ గా గోవిందుడు అందరివాడు అని పెట్టబోతున్నట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వంశీ పైడిపల్లి డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ప్రియమణిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు నుంచి సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని చెప్తున్నారు. ఇక ఈ కథను ఎన్టీఆర్ కి బాగా నచ్చటంతో ఎమ్.ఎల్.ఎ అని షాక్ డైరక్టర్ తో చేయనున్న డేట్స్ ని సైతం దీనికి కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వంశి పైడిపల్లి ఇంతకుముందు ప్రభాస్ తో మున్నా చిత్రాన్ని డైరక్ట్ చేసారు. మున్నా అప్పట్లో పెద్దగా ఆడలేదు. అలాగే ఎన్టీఆర్ ప్రస్తుతం వి.వి.వినాయిక్ దర్శకత్వంలో అదుర్స్ చిత్రంలో చేస్తున్నారు.దీంతో పాటు అశ్వనీదత్-మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రూపొందే మరో చిత్రంలోనూ ఎన్టీఆర్ నటించనున్నారు. ఇది అక్టోబరులో ప్రారంభమవుతుంది.