ఎన్టీఆర్ స్టైల్ అదిరింది (న్యూలుక్ ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్‌ను స్టైలిష్‌గా మాస్ లుక్‌తో చూపించబోతున్నాడు. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలే అందుకు నిదర్శనం.

ఇటీవల కర్నాటకలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'రామయ్యా వస్తావయ్యా'...ఆ షెడ్యూల్లో రెండు పాటలతో పాటు కొన్ని టాకీ సీన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ఈ రోజు నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపనున్నారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సమంతా, శృతిహాసన్ హీరోయిన్స్.

ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ... ''బృందావనంలో ఎన్టీఆర్‌ని సరికొత్తగా చూపించాం. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ని వైవిధ్యభరితమైన పాత్రలో ఆవిష్కరించబోతున్నాం. ఆయన అభిమానులు ఏం కోరుకొంటున్నారో అవన్నీ ఈ కథలో మేళవించాం. ఎన్టీఆర్‌, సమంతలపై తెరకెక్కించిన సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి''అన్నారు.

అదిరిపోయే డైలాగులు...


‘బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా..నన్ను అలా పిలవాలంటే ఓ అర్హత వుండాలి. లేదా నా అభిమాని అయివుండాలి...అంటూ టీజర్‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌తో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా వుంటుందని నిర్మాత హామీ ఇస్తున్నారు.

జూ ఎన్టీఆర్ సెంటిమెంట్


ఎన్టీఆర్ సెంటిమెంట్‌గా భావించే సెప్టెంబర్ 17న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాత దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నారని సమాచారం.

సాంకేతిక వర్గం వివరాలు


ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాక్షిగహణం: చోటా కె. నాయుడు, ఎడిటింగ్: అవినాష్ సైలా, స్క్రీన్‌ప్లే: రమేష్‌డ్డి, వేగేశ్న సతీష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X