‘బాద్ షా’ లుక్‌తో పబ్లిక్‌లోకి జూ ఎన్టీఆర్

అయితే రాజకీయ పరిస్థితుల ప్రభావంతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్టుండి పబ్లిక్‌లోకి రాక తప్పలేదు. తన గత సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన నేపథ్యంలో అతని వెనక తానే ఉన్నట్లు వస్తున్న ఆరోపణలను ఖండించేందుకు జూనియర్ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ సమావేశంలో జూ ఎన్టీఆర్ లుక్ సూపర్బ్. జూనియర్ ఫేస్‌లో చాలా మార్పులు వచ్చి గతంలో కంటే మరింత గ్లామరస్‌గా కనిపిస్తున్నాడు. ఉంగరాల జుట్టును మార్చి సరికొత్త హెయిర్ స్టయిల్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడే ఇలా ఉన్నాడంటే రేపు సినిమాలో ఏరేంజిలో కనిపిస్తాడో..
బాద్ షా చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ హీరోయిన్. దూకుడు చిత్రానికి పని చేసిన కోన్ వెంకట్, గోపీ మోహన్ తదితరులు సినిమాను పూర్తిస్థాయి ఎంటర్ టైన్మెంట్ చిత్రంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నారు. తమన్ మరోసారి జూనియర్ అభిమానుల మెప్పించే ట్యూన్స్ రెడీ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











