twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. ఆర్ఆర్ఆర్ కోసం.. గుర్తుపట్టలేని విధంగా మారిపోతాడా ఏంటి!

    |

    Recommended Video

    NTR New Look For RRR Movie Goes Viral

    యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ దక్షిణాదిలోనే అతిపెద్ద మల్టీస్టారర్ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించబోయే ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రం నవంబర్ 11 న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే రాజమౌళి ఈ చిత్రానికి సంబంధించిన వర్క్ ప్రారంభించేశాడు. అరవింద సమేత చిత్రం ఫినిష్ చేసిన ఎన్టీఆర్ లుక్ పై జక్కన్న దృష్టి పెట్టాడు. తాజాగా ఎన్టీఆర్ లుక్ కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    అనుష్క, ప్రభాస్ ఇద్దరూ వస్తున్నారు.. కన్నుల పండుగే.. ఎన్టీఆర్, చరణ్ ప్రారంభించేది!అనుష్క, ప్రభాస్ ఇద్దరూ వస్తున్నారు.. కన్నుల పండుగే.. ఎన్టీఆర్, చరణ్ ప్రారంభించేది!

    గుబురు గడ్డం

    గుబురు గడ్డం

    ఎన్టీఆర్ ఇప్పటి వరకు నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాలలో గడ్డం లుక్ లో రఫ్ గా కనిపించాడు. మాస్ లో అభిమానులు ఎక్కువగా ఉన్న ఎన్టీఆర్ అలాంటి లుక్ లో కనిపిస్తేనే బావుంటుంది. అరవింద సమేత చిత్రం తరువాత ఫ్రీ అయిపోయిన ఎన్టీఆర్ మళ్ళీ గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు.

    ఆ చిత్రాలలో డిఫెరెంట్‌గా

    ఆ చిత్రాలలో డిఫెరెంట్‌గా

    యమదొంగ, జై లవకుశ లాంటి చిత్రాల్లో ఎన్టీఆర్ డిఫెరెంట్ గెటప్ లో కనిపించి అలరించాడు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్ ని సరికొత్త లుక్ లో చూపించబోతున్న సంగతి తెలిసిందే.

    ఆర్ఆర్ఆర్ కోసం

    ఆర్ఆర్ఆర్ కోసం

    తాజాగా వైరల్ అవుతున్న ఎన్టీఆర్ లుక్ ఆర్ఆర్ఆర్ కోసం అంటూ ప్రచారం జరుగుతోంది. 1920 కాలం నాటి కథతో ఈ చిత్రం తెరకెక్కబోతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగా ఎన్టీఆర్ గుబురుగా గడ్డం, మీసాలు పెంచుతున్నాడని అంటున్నారు. ఇప్పటికే రాజమౌళి ఎన్టీఆర్ లుక్ కోసం ఫిజికల్ ట్రైనర్ స్టీవ్ లాయిడ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.

    300 కోట్ల బడ్జెట్

    300 కోట్ల బడ్జెట్

    ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మించబోతున్నారు. చిత్రం లాంచ్ అయ్యాక మరిన్ని విశేషాలు తెలియనున్నాయి. తొలి షెడ్యూల్ కోసం హైదరాబాద్ లోని గండిపేటలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    NTR new look for RRR movie goes viral. Rajamouli directing this big budget movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X