చివరకు ఎన్టీఆర్ ని 'ఊసరవిల్లి'గా మారుస్తున్నారు
ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో అతడే ఆమె సైన్యం అనే టైటిల్ తో ఓ చిత్రం త్వరలో ప్రారంభం కానున్నదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా చిత్రానికి ఊసరివిల్లి అనే టైటిల్ పెడదామని సురేంద్రరెడ్డి ఫిక్సయ్యారని తెలుస్తోంది. నిజానికి ఊసరవిల్లి టైటిల్..మొదట రామ్, జెనీలియా కాంబినేషన్ అనుకున్నప్పుడు అనుకున్నది. ఆ తర్వాత రాణాకీ ఆ టైటిలే అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ దగ్గరకి వచ్చేసరికి అదే స్క్రిప్టుకి అతడే ఆమె సైన్యం అని పెడదామని రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ సురేంద్రరెడ్డి...కథ ప్రకారం ఊసరివిల్లి అయితేనే కరెక్టుగా సరిపోతుందని భావించి ఎన్టీఆర్ ని ఒప్పించాడని చెప్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్...బృందావనం చిత్రం విడుదలై విజయవంతంగా నడుస్తోంది. ఇక సురేంద్రరెడ్డి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో గతంలో అశోక్ చిత్రం వచ్చింది. అలాగే సురేంద్రరెడ్డి కిక్ విజయం తర్వాత చేస్తున్న చిత్రం ఇదే. మరో ప్రక్క ఎన్టీఆర్...శక్తి చిత్రం షూటింగ్ లలో బిజీగా పాల్గొంటున్నారు.


Click it and Unblock the Notifications











