ఎక్స్ క్లూజివ్: ఆ దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా!
మహానటి చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. నిర్మాత అశ్వినీదత్ నాగార్జున,నాని, మహేశ్ సినిమాలు లైన్ లో ఉండగానే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కూడా అనౌన్స్ చెయ్యడం జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే వైజయంతి మూవీస్ బ్యానర్ లో సినిమా ఉంటుందని ప్రకటించాడు ఈ నిర్మాత.

బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది
తాజాగా వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమా మహానటి. ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం బాగా డిమాండ్ పెరిగినట్లు సమాచారం. తాజా సమాచారం మేరకు మహానటి సినిమాను ఏకంగా 11 కోట్లకు హక్కుల్ని జీ నెట్ వర్క్ సొంతం చేసుకుందని తెలుస్తోంది.
Recommended Video


నాని, నాగార్జున హీరోలుగా ఓ మల్టీస్టారర్
మహానటి లాంటి లో బడ్జెట్ చిన్న సినిమాకు ఇది చాలా ఎక్కువ మొత్తం అని చెప్పాలి. సినిమాను ప్రేక్షకులు బాగా ఆధరిస్తున్న కారణంగా భారి మొత్తంలో శాటిలైట్ రైట్స్ అమ్ముడు అయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహంలో వరస సినిమాలు చెయ్యబోతున్నాడు నిర్మాత అశ్వినీదత్. ప్రస్తుతం ఈ నిర్మాత నాని, నాగార్జున హీరోలుగా ఓ మల్టీస్టారర్.. మహేశ్ హీరోగా మరో సినిమా చేస్తున్నాడు.

జయంతికి మళ్లీ పునర్వైభవం
నిర్మాత అశ్వినీదత్ నాగార్జున,నాని, మహేశ్ సినిమాలు లైన్ లో ఉండగానే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కూడా అనౌన్స్ చెయ్యడం జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే వైజయంతి మూవీస్ బ్యానర్ లో సినిమా ఉంటుందని ప్రకటించాడు ఈ నిర్మాత. ఏదేమైనా వై జయంతికి మళ్లీ పునర్వైభవం వచ్చింది అంటున్నారు జనాలు.

విక్రమ్ కుమార్ తో ఎన్టీఆర్
వరుస సూపర్ హిట్లతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోరుమీద ఉన్నాడు. తాజాగా ఎన్టీఆర్ త్రిపాత్రభినయం చేసిన 'జైలవకుశ' ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రాజమౌళి సినిమా చెయ్యబోతున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ విక్రమ్ కుమార్ తో సినిమా ఉంటుందని సమాచారం. వైజయంతి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది.


Click it and Unblock the Notifications











